Aadhaar free update: ఆధార్‌లో అడ్రస్‌ అప్‌డేట్... ఎలా చేసుకోవాలంటే?

Aadhaar free update: ఆధార్‌లో అడ్రస్‌ అప్‌డేట్... ఎలా చేసుకోవాలంటే?

Play all audios:

Loading...

Aadhaar free update | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆధార్‌ (Aadhaar) కార్డులో మీ అడ్రస్‌ వివరాలు అప్‌డేట్‌ చేసుకోవడానికి బయట కేంద్రాలకే వెళ్లనక్కర్లేదు. ఇంట్లోనే ఆన్‌లైన్‌లో కొన్ని మార్పులు


చేసుకోవచ్చు. అందులో అడ్రస్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌ కూడా ఉంది. ఆ ప్రక్రియ ఎలా అంటే..? ఈ పద్ధతి ఫాలో అయితే.. * ముందుగా _MYAADHAAR_ పోర్టల్‌లోకి వెళ్లి.. లాగిన్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి.  * తర్వాతి


స్క్రీన్‌లో 12-అంకెల ఆధార్ నంబర్‌, క్యాప్చా కోడ్‌ నమోదు చేయాలి. * అప్పుడు మీ మొబైల్‌కు OTP వస్తుంది. ఆ వివరాలు నమోదు చేసి లాగిన్‌ అవ్వాలి.  * డ్యాష్‌బోర్డులో ఆధార్‌ సర్వీసు ఆప్షన్ల నుంచి


అడ్రస్‌ ఛేంజ్‌ను ఎంచుకోవాలి.  * అక్కడ చూపించే మీ వివరాలు సరి చూసుకొని.. నెక్స్ట్‌ బటన్‌ క్లిక్‌ చేసి సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. * ఈ క్రమంలో డాక్యుమెంట్‌ సైజులు, నమోదు చేసిన


వివరాలు సరి చూసుకొని సబ్మిట్‌ చేసి.. పేమెంట్‌ చేశాక SRN నెంబర్‌ వస్తుంది.  * దాంతో వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్‌డేట్‌ స్టేటస్‌ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవచ్చు. * మీ వివరాలు


 అప్‌డేట్‌ అయినట్లు మొబైల్‌కు మెసేజ్‌ వచ్చాక పై వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.