Play all audios:
Gold price | దిల్లీ: బంగారం ధర మళ్లీ భగ్గుమంది. అంతర్జాతీయంగా ఆర్థిక ఉద్రిక్తతలతో పసిడి ధర చుక్కలనంటుతోంది. అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు రోజు రోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో సురక్షితమని
భావించే పసిడిపైకి మళ్లీ పెట్టుబడులు మళ్లుతున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ధర క్రితం ముగింపుతో (బుధవారం) పోలిస్తే రూ.6250 పెరిగి శుక్రవారం రూ.96,450కు చేరింది.
సాయంత్రం 6 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో రూ.96,430 స్థాయి వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర 3,223 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇంట్రాడేలో 3,237
డాలర్లకు చేరుకుంది. దీన్ని అనుసరించి దేశీయంగా 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్ల) బంగారం ధర రూ.96 వేల మార్కు దాటింది. 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం కూడా రూ.96 వేలు పలుకుతోంది. మల్టీ కమొడిటీ
ఎక్స్ఛేంజీలో 10 గ్రాముల పసిడి ధర జూన్ డెలివరీ రూ.1703 పెరిగి రూ.93,736కు చేరుకుంది. వెండి కిలో రూ.95,500 పలుకుతోంది. * మార్కెట్ ఎఫెక్ట్.. ఈక్విటీల్లోకి MF పెట్టుబడులు 14% డౌన్ తగ్గినట్లే
తగ్గి.. వాణిజ్య యుద్ధ భయాలతో ఏప్రిల్ 2న బంగారం ఔన్సు అంతర్జాతీయంగా 3200 డాలర్లను తాకింది. తర్వాత లాభాల స్వీకరణతో కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే, ఇతర దేశాలపై విధించిన టారిఫ్‌లను
తాత్కాలికంగా నిలుపుదల చేసిన ట్రంప్.. చైనాపై మాత్రం కొనసాగించారు. ఆ దేశంపై ఏకంగా 145 శాతం టారిఫ్‌లను విధించారు. ప్రతిగా చైనా కూడా 125 శాతం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాలు వాణిజ్య,
ఆర్థిక అనిశ్చితులకు కారణమయ్యాయి. దీంతో మాంద్యం భయాలు నెలకొన్నాయి. డాలర్ ఇండెక్స్ నూరు డాలర్లకు దిగువకు చేరడం పసిడికి మరింత డిమాండ్ పెంచింది. సెంట్రల్ బ్యాంకులు కూడా పెద్ద మొత్తంలో బంగారం
నిల్వలను పెంచుకుంటుండడంతో పుత్తడి ధరకు రెక్కలు రావడానికి కారణమని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. POLL: బంగారం లక్షకు చేరుతుందా?