Play all audios:
వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖరరెడ్డి (రాజ్ కసిరెడ్డి) తండ్రి ఉపేందర్‌రెడ్డి మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడ: వైకాపా హయాంలో జరిగిన మద్యం
కుంభకోణంలో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖరరెడ్డి (రాజ్ కసిరెడ్డి) తండ్రి ఉపేందర్‌రెడ్డి మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు.
గురువారం ఉపేందర్‌రెడ్డి సిట్ ఎదుట హాజరవగా.. సుమారు 6 గంటలపాటు అధికారులు విచారించారు. రాజ్ కసిరెడ్డి ఆచూకీ, ఆర్థిక లావాదేవీలు, ఆయనతో సంబంధాలున్న వ్యక్తుల గురించి ఆరాతీశారు. సిట్ అధికారులు
ఏమడిగినా తనకేమి తెలియదని, గుర్తులేదని ఉపేంద్రరెడ్డి సమాధానాలిచ్చారు. దీంతో ఆయనను శుక్రవారం మరోసారి విచారించారు.