Play all audios:
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విభిన్నమైన చిత్రాలు నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు అల్లు అరవింద్ (Allu Aravind). వరుస ప్రాజెక్టులతో తరచూ బిజీగా ఉండే ఆయన
తాజాగా ఫ్రీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అల్లు అర్జున్ (Allu Arjun) కుమారుడు, తన మనవడు, అయాన్ (Ayaan)తో కలిసి ఇంటి ఆవరణలో సరదాగా క్రికెట్ ఆడారు. అయాన్ బ్యాటింగ్ చేయగా.. ఆయన
బౌలింగ్ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా బన్నీ సతీమణి స్నేహారెడ్డి ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అయాన్ భవిష్యత్తులో మంచి
క్రికెటర్ అవుతాడంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే అల్లు అరవింద్ సమర్పణలో ‘తండేల్’ (Thandel) తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై సిద్ధమవుతోన్న ఈ
చిత్రాన్ని బన్నీవాసు నిర్మిస్తున్నారు. నాగచైతన్య (Naga Chaitanya) - సాయిపల్లవి (Sai pallavi) జంటగా నటిస్తోన్న చిత్రమిది. చందు మొండేటి దర్శకుడు. భారీ బడ్జెట్‌తో ఇది నిర్మితం అవుతుంది. ఓ
మత్స్యకారుడి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని, సినిమాటిక్‌గా చెబుతున్న కథ ఇది. ‘‘గత ఏడాదిన్నర నుంచి ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ‘తండేల్’
విభిన్నమైన ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. అందుకోసం దర్శకుడు చందు, నటుడు నాగచైతన్యతో టీమ్ అంతా ఎంతో శ్రమించారు. భారీ స్కేల్‌లో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నాం’’
అని సినిమా ప్రారంభం రోజు అరవింద్ తెలిపారు. మరోవైపు, అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’ కోసం వర్క్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. రష్మిక కథానాయిక.