Opal suchata: నెక్స్ట్‌ టైమ్‌.. ప్రభాస్‌ మూవీపై రివ్యూ ఇస్తా: ప్రపంచ సుందరి

Opal suchata: నెక్స్ట్‌ టైమ్‌.. ప్రభాస్‌ మూవీపై రివ్యూ ఇస్తా: ప్రపంచ సుందరి

Play all audios:

Loading...

ప్రభాస్‌ (Prabhas) నటించిన ఓ సినిమాని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రపంచ సుందరి ఓపల్ సుచాత (opal suchata). త్వరలోనే తాను ఆ సినిమా చూడాలనుకుంటున్నానని తెలిపారు. ఇంటర్నెట్‌డెస్క్‌:


108 దేశాల అందగత్తెలను వెనక్కి నెట్టి ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు థాయ్‌లాండ్‌ భామ ఓపల్ సుచాత (opal suchata). మిస్‌ వరల్డ్‌ 2025గా విజయం సాధించిన అనంతరం ఆమె జాతీయ మీడియాతో


ముచ్చటించారు. భారతీయ సినిమాల గురించీ మాట్లాడారు. తనకు బాలీవుడ్‌ నటి అలియాభట్‌ (Alia Bhatt) తెలుసన్నారు. ఈ ప్రయాణంలో ఎంతో మంది సుందరీమణులు తనలో స్ఫూర్తి నింపారని చెప్పారు. భారత దేశం నుంచి


ప్రపంచ సుందరిగా విజయాన్ని అందుకున్న వారిలో ఎవరంటే మీకు ఇష్టం అని ప్రశ్నించగా.. ‘‘ఈ ప్రశ్నకు బదులు చెప్పడం చాలా కష్టం. నాకెంతో ఇష్టమైన మానుషి చిల్లర్‌ను ఫినాలేలో కలిశాను. అదే విధంగా నాకు


ప్రియాంకా చోప్రా అంటే ఎంతో ఇష్టం. ఆమె నుంచి స్ఫూర్తి పొందాను. వీలున్నప్పుడు సినిమాలు చూస్తుంటా. బాలీవుడ్‌లో తెరకెక్కిన పలు చిత్రాలు ఇప్పటికే చూశాను. అలియాభట్ నాకు తెలుసు. ఆమె నటించిన


‘గంగూబాయి కాఠియావాడి’ నాకెంతో నచ్చింది. ప్రేక్షకులను ఆలోచింప చేసే చిత్రమది. ‘బాహుబలి’ సినిమా గురించి విన్నాను. కానీ, ఆ సినిమా ఇంకా చూడలేదు. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భాగంగా కొన్నిరోజుల క్రితం


మేమంతా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీ సందర్శించాం. పోటీలు పూర్తైన తర్వాత తప్పకుండా ఆ సినిమా చూడాలని నాకు నేనే ప్రామిస్‌ చేసుకున్నా. మళ్లీ నేను ఇక్కడికి వచ్చే నాటికి తప్పకుండా ఆ సినిమాపై


రివ్యూ ఇస్తా’’ అని ఆమె చెప్పారు. * నిశ్చితార్థ వార్తల వేళ.. అసలు విషయం చెప్పిన శ్రీలీల అనంతరం కిరీటాన్ని గెలుపొందడాన్ని ఉద్దేశిస్తూ.. ‘‘ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన రోజు. వ్యక్తిగతంగానే


కాకుండా థాయ్‌లాండ్‌ ప్రజలకూ ఇదొక మైలు రాయి అనే చెప్పాలి. నేనెంతో గర్వపడుతున్నా. మిస్‌ వరల్డ్‌ స్టేజ్‌పై మా దేశానికి గుర్తింపు లభించింది. మా దేశానికి ఇదే తొలి విజయం. ఇలాంటి ఒక రోజు కోసం


మేమంతా 70 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం. ఈ ప్రయాణం క్లిష్టమైనదని నేను చెప్పను. ఎందుకంటే, మన హృదయానికి చేరువైన దానిని పొందేందుకు వేసే ప్రతి అడుగుకు ఒక అర్థం ఉంటుంది’’ అని ఆమె వివరించారు.