Play all audios:
ఇప్పుడు తెలుగులోనూ.. kesari chapter 2 Telugu || అక్షయ్ కుమార్ (Akshay Kumar) ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా ‘కేసరి చాప్టర్ 2’. ఇటీవల హిందీలో విడుదలైన ఈ సినిమా
విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. మే 23న సురేశ్ ప్రొడక్షన్స్ ఈమూవీని తెలుగులో విడుదల చేస్తున్నారు. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ
చిత్రంలో ఆర్.మాధవన్, అనన్య పాండే, రెజీనా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో నెత్తుటి అధ్యాయం 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ మారణకాండ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని
ఈ సినిమా సిద్ధమైంది. ------------------------- క్రైమ్ కామెడీతో విజయ్ సేతుపతి Ace movie || విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘ఏస్’.
ఆర్ముగ కుమార్ దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు, తెలుగులోనూ మే 23న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. యోగిబాబు, అవినాశ్, పృథ్వీరాజ్, దివ్య పిళ్లై కీలక పాత్రలు పోషించారు.
------------------------- కొత్త నటీనటులతో.. Vaibhavam Movie || రుత్విక్, ఇక్రా ఇద్రిసి జంటగా నటించిన చిత్రం ‘వైభవం’.సాత్విక్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. కొత్త నటీనటులతో ఫీల్ గుడ్
కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తీర్చిదిద్దారు. క్లీన్ యు సర్టిఫికెట్ పొందిన ఈ మూవీ మే 23న థియేటర్లో ప్రేక్షకులను అలరించనుంది. ------------------------- ఓటీటీలో విడుదల కావాల్సిన మూవీ.. Bhool
Chuk Maaf Movie || రాజ్‌కుమార్ రావ్ (Rajkummar Rao), వామికా గబ్బీ (Wamiqa Gabbi) జంటగా నటించిన సినిమా ‘భూల్ చుక్ మాఫ్’. మే 9న బాక్సాఫీసు ముందుకు రావాల్సిన ఈ మూవీని చిత్ర బృందం వాయిదా
వేసిన సంగతి తెలిసిందే. భారత్- పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం కారణంగా నేరుగా ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో ఈ నెల 16న రిలీజ్ చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితం ప్రకటించింది.
ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగాయని పేర్కొన్న నిర్మాణ సంస్థ ‘మాడాక్ ఫిల్మ్స్’.. సినిమాని థియేటర్లలోనే రిలీజ్ చేయనున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు
తీసుకొస్తున్నట్టు తెలిపింది. ------------------------- హిస్టారికల్యాక్షన్ డ్రామా.. Kesari Veer || సునీల్ శెట్టి, సూరజ్ పాంచోలి, వివేక్ ఒబెరాయ్, ఆకాంక్ష శర్మ కీలక పాత్రల్లో రూపొందిన
హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ ‘కేసరి వీర్’. ప్రిన్స్ థిమన్, కనుభాయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. మే 16న విడుదల కావాల్సిన ఈ మూవీ ఒక వారం ఆలస్యంగా మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో
సునీల్‌శెట్టి పోరాట యోధుడిగా కనిపించనున్నాడు. ప్రతినాయకుడు జఫర్ ఖాన్ పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు. ------------------------- ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించే చిత్రాలు
వెబ్‌సిరీస్‌లివే! * నెట్‌ఫ్లిక్స్ * సారా సిల్వర్‌మ్యాన్ (హాలీవుడ్) మే 20 * రియల్ మెన్ (వెబ్‌సిరీస్) మే 21 * ది వైల్డ్రోబో (యానిమేషన్) మే 24 * అమెజాన్ ప్రైమ్ * మోటార్ హెడ్స్
(వెబ్‌సిరీస్) మే 20 * జియో హాట్‌స్టార్ * ల్యాండ్ మ్యాన్ (వెబ్‌సిరీస్) మే 21 * హార్ట్‌బీట్2 (తెలుగు సిరీస్) మే 22 * * ఫైండ్ ది ఫర్జీ (హిందీ రియాల్టీ షో) మే 23 * ఈటీవీ విన్ * కథాసుధ:
కాలింగ్ బెల్ స్ట్రీమింగ్ అవుతోంది.