Play all audios:
బెలైట్: బ్రూనైలోని బెలైట్‌లో మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక బెలైట్ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మాతృమూర్తులు, వారి చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమాన్ని ఉమామహేశ్వరి సమన్వయం చేశారు. తల్లులు, పిల్లలు మ్యాచింగ్ డ్రెస్‌ల్లో హాజరై ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసందర్భంగా
మాతృమూర్తులకు, పిల్లలకు మధ్య నిర్వహించిన పోటీలు అలరించాయి. పిల్లలతో కలిసి తల్లులు ర్యాంప్ వాక్ చేసి సందడి చేశారు. ఆ తర్వాత అమ్మ ప్రేమను పాటల రూపంలో పిల్లలు తెలియజేశారు. ఈసందర్భంగా అతిథులకు
రుచికరమైన వంటకాలను వడ్డించారు. ఈ కార్యక్రమం చివర్లో అందరికీ మసాలా టీని అందించారు. ఆద్యంతం ఈ వేడుక మాతృత్వపు గొప్పదనాన్ని చాటడమే కాకుండా.. బెలైట్‌లోని తెలుగు కమ్యూనిటీ సాంస్కృతిక స్ఫూర్తిని
ప్రతిబింబించింది.