Kolkata knight riders: కోల్‌కతా.. చేసిన తప్పులే మళ్లీ చేస్తోంది: ఇయాన్‌ మోర్గాన్‌

Kolkata knight riders: కోల్‌కతా.. చేసిన తప్పులే మళ్లీ చేస్తోంది: ఇయాన్‌ మోర్గాన్‌

Play all audios:

Loading...

డిపెండింగ్‌ ఛాంపియన్స్‌గా ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అడుగుపెట్టిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ముఖ్యంగా బ్యాటింగ్‌ వైఫల్యాలతో, చేసిన తప్పులనే మళ్లీ చేస్తూ పరాజయాలను మూటగట్టుకుంటోంది. ఇంటర్నెట్‌ డెస్క్‌: డిపెండింగ్‌ ఛాంపియన్స్‌గా ఐపీఎల్‌ (IPL) 2025 సీజన్‌లో అడుగుపెట్టిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌  (Kolkata Knight Riders) ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ముఖ్యంగా బ్యాటింగ్‌ వైఫల్యాలతో పరాజయాలను మూటగట్టుకుంటోంది. సోమవారం గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans)తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. కోల్‌కతాకు వరుసగా ఇది రెండో ఓటమి. ఆఖరి అయిదు మ్యాచుల్లో మూడో పరాజయం. ఓవరాల్‌గా ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచుల్లో అయిదో పరాజయం. మూడుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్స్‌గా నిలిచిన కోల్‌కతా తమ హోం గ్రౌండైన ఈడెన్‌ గార్డెన్స్‌లో తలపడిన మ్యాచుల్లోనూ తడబడుతోంది. ఇక్కడ ఇప్పటివరకు నాలుగు మ్యాచులు జరిగితే అందులో మూడింట్లో ఓటమి పాలైంది.  తమ బౌలింగ్‌ విభాగం బాగున్నప్పటికీ, బ్యాటింగ్‌లో వైఫల్యాల వల్లే తాము ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నామని కెప్టెన్‌ అజింక్య రహానే (Ajinkya Rahane) అంగీకరించారు. ఈ విషయమై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (Eoin Morgan) స్పందించాడు. ‘మనం కోరుకుంటున్నట్లుగా కోల్‌కతా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని బౌన్స్‌ బ్యాక్‌ కావడం లేదు. చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తోంది. వారు తమ బ్యాటింగ్‌ లైనప్‌లో కొన్ని మార్పులు చేశారు. కానీ అవి వర్కౌట్‌ కాలేదు’ అని మోర్గాన్‌ అన్నాడు.  రహానే చేసిన వ్యాఖ్యల మీద కూడా ఈ మాజీ తన అభిప్రాయం వ్యక్తంచేశాడు. ‘గుజరాత్‌ టైటాన్స్‌ చేసిన 199 పరుగుల లక్ష్యాన్ని మేం ఛేదించగలం అనుకున్నామని అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు నన్ను కాస్త ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎందుకంటే... ఈ పిచ్‌పై బాల్‌ అనుకున్నదానికంటే కాస్త ఎక్కువ ఎత్తులో వచ్చింది. ఈ కారణంగానే బౌండరీలు కొట్టడం బ్యాటర్లకు కష్టంగా మారింది. అలాగే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో భాగస్వామ్యాలు లేవు. ప్రసిద్ధ్‌ కృష్ణ (Prasidh Krishna) మాత్రం చక్కగా బౌలింగ్‌ చేసి కీలక సమయంలో రెండు వికెట్లు తీసుకున్నాడు’ అని ఇయాన్‌ మోర్గాన్‌ విశ్లేషించాడు. ‘అతనో క్లాసికల్‌ బ్యాటర్‌’ టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్‌ అంబటి రాయుడు (Ambati Rayudu).. ఈ మ్యాచ్‌లో 36 బంతుల్లో 52 పరుగులు చేసిన సాయి సుదర్శన్‌(Sai Sudharsan)ను ప్రశంసించాడు. ‘సాయి సుదర్శన్‌ బ్యాటింగ్‌ చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. క్లాసికల్‌ బ్యాటర్‌లా క్రీజులో కదులుతూ సంప్రదాయక రీతిలో పరుగులు రాబట్టాడు. బంతి పేస్‌ను వాడుకొని, స్మార్ట్‌ క్రికెట్‌ ఆడాడు. తెలివిగా ఆడుతూ... పరుగులు రాబడితే మనలో ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది’ అని అంబటిరాయుడు అన్నాడు. 

డిపెండింగ్‌ ఛాంపియన్స్‌గా ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అడుగుపెట్టిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ముఖ్యంగా బ్యాటింగ్‌ వైఫల్యాలతో, చేసిన తప్పులనే మళ్లీ చేస్తూ పరాజయాలను


మూటగట్టుకుంటోంది. ఇంటర్నెట్‌ డెస్క్‌: డిపెండింగ్‌ ఛాంపియన్స్‌గా ఐపీఎల్‌ (IPL) 2025 సీజన్‌లో అడుగుపెట్టిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌  (Kolkata Knight Riders) ఆశించిన స్థాయిలో రాణించడం లేదు.


ముఖ్యంగా బ్యాటింగ్‌ వైఫల్యాలతో పరాజయాలను మూటగట్టుకుంటోంది. సోమవారం గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans)తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. కోల్‌కతాకు వరుసగా ఇది రెండో ఓటమి. ఆఖరి


అయిదు మ్యాచుల్లో మూడో పరాజయం. ఓవరాల్‌గా ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచుల్లో అయిదో పరాజయం. మూడుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్స్‌గా నిలిచిన కోల్‌కతా తమ హోం గ్రౌండైన ఈడెన్‌ గార్డెన్స్‌లో తలపడిన


మ్యాచుల్లోనూ తడబడుతోంది. ఇక్కడ ఇప్పటివరకు నాలుగు మ్యాచులు జరిగితే అందులో మూడింట్లో ఓటమి పాలైంది.  తమ బౌలింగ్‌ విభాగం బాగున్నప్పటికీ, బ్యాటింగ్‌లో వైఫల్యాల వల్లే తాము ఆశించిన స్థాయిలో


రాణించలేకపోతున్నామని కెప్టెన్‌ అజింక్య రహానే (Ajinkya Rahane) అంగీకరించారు. ఈ విషయమై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (Eoin Morgan) స్పందించాడు. ‘మనం కోరుకుంటున్నట్లుగా


కోల్‌కతా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని బౌన్స్‌ బ్యాక్‌ కావడం లేదు. చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తోంది. వారు తమ బ్యాటింగ్‌ లైనప్‌లో కొన్ని మార్పులు చేశారు. కానీ అవి వర్కౌట్‌ కాలేదు’ అని


మోర్గాన్‌ అన్నాడు.  రహానే చేసిన వ్యాఖ్యల మీద కూడా ఈ మాజీ తన అభిప్రాయం వ్యక్తంచేశాడు. ‘గుజరాత్‌ టైటాన్స్‌ చేసిన 199 పరుగుల లక్ష్యాన్ని మేం ఛేదించగలం అనుకున్నామని అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు


నన్ను కాస్త ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎందుకంటే... ఈ పిచ్‌పై బాల్‌ అనుకున్నదానికంటే కాస్త ఎక్కువ ఎత్తులో వచ్చింది. ఈ కారణంగానే బౌండరీలు కొట్టడం బ్యాటర్లకు కష్టంగా మారింది. అలాగే కోల్‌కతా


నైట్‌ రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో భాగస్వామ్యాలు లేవు. ప్రసిద్ధ్‌ కృష్ణ (Prasidh Krishna) మాత్రం చక్కగా బౌలింగ్‌ చేసి కీలక సమయంలో రెండు వికెట్లు తీసుకున్నాడు’ అని ఇయాన్‌ మోర్గాన్‌ విశ్లేషించాడు.


‘అతనో క్లాసికల్‌ బ్యాటర్‌’ టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్‌ అంబటి రాయుడు (Ambati Rayudu).. ఈ మ్యాచ్‌లో 36 బంతుల్లో 52 పరుగులు చేసిన సాయి సుదర్శన్‌(Sai Sudharsan)ను ప్రశంసించాడు. ‘సాయి సుదర్శన్‌


బ్యాటింగ్‌ చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. క్లాసికల్‌ బ్యాటర్‌లా క్రీజులో కదులుతూ సంప్రదాయక రీతిలో పరుగులు రాబట్టాడు. బంతి పేస్‌ను వాడుకొని, స్మార్ట్‌ క్రికెట్‌ ఆడాడు. తెలివిగా ఆడుతూ... పరుగులు


రాబడితే మనలో ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది’ అని అంబటిరాయుడు అన్నాడు.