Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ సంజుశాంసన్‌ల మధ్య విభేదాలు తలెత్తినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం సూపర్ ఓవర్ ఫలితమని తెలుస్తోంది.
ఐపీఎల్ (IPL) 2025 సీజన్‌లో తొలి సూపర్ ఓవర్ రాజస్థాన్ రాయల్స్ - దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌పై దిల్లీ విజయం సాధించింది. ఇదే కారణమని అభిమానులు కామెంట్లు
చేస్తున్నారు. సంజు శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)కు వచ్చేయమని సూచనలు చేశారు. అసలేం జరిగిందంటే? * ప్రతి బ్యాట్‌కు పరీక్ష దిల్లీతో సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు రియాన్
పరాగ్, షిమ్రోన్ హెట్‌మయెర్ వచ్చారు. యశస్వి జైస్వాల్‌ను రెండో వికెట్‌గా పంపించారు. సాధారణంగా సంజుశాంసన్ ఓపెనర్‌గా వస్తాడు. కానీ పక్కటెముకల నొప్పి కారణంగా సంజు బరిలోకి దిగలేదు. దిల్లీ
బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ వేశాడు. సూపర్ ఓవర్‌కు ముందు కోచ్ ద్రవిడ్ (Rahul Dravid) తన జట్టు సభ్యులతో మాట్లాడుతూ కనిపించాడు. కెప్టెన్ సంజు (Sanju Samson) మాత్రం డగౌట్‌కు కాస్త దగ్గరగా
ఉన్నాడు. దగ్గరకు రమ్మని సంజును ఆహ్వానించినా.. వెళ్లలేదు. అతడిని బ్యాటింగ్‌కు వద్దనుకొని మేనేజ్‌మెంట్ భావించిందని.. అందుకే, సంజు డిస్కషన్ వద్దకు వెళ్లలేదని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
దీంతో అభిమానులు సంజును కెప్టెన్సీని వదిలేయమని సూచించడంతోపాటు జట్టును మారిపోవాలని కోరారు. ‘‘ద్రవిడ్‌తో సంజు శాంసన్‌కు ఎప్పుడూ సమస్యగానే ఉన్నట్లుంది. భారత జట్టులో ఉన్నప్పడూ ఇదే పరిస్థితి’’
‘‘సంజు ఫ్రాంచైజీని వదిలేయ్. అక్కడ విలువ లేనప్పుడు ఉండటం వృథా. సీఎస్కే తరఫున మేం ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది’’ ‘‘వీరి మధ్య ఏదో లడాయి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
మేనేజ్‌మెంట్ సంజును పట్టించుకోవడం లేదు. ఆ విషయం దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది’’ ‘‘కెప్టెన్ నిర్ణయం ఏంటనేది మేనేజ్‌మెంట్‌కు అవసరం లేదనుకుంటా. రియాన్‌ను ఎప్పుడు హైలైట్
చేద్దామా? అనే ఉద్దేశం కనిపిస్తోంది. సంజు ఆలోచనలను కూడా పట్టించుకోకపోవడం దారుణం’’ ‘‘రాజస్థాన్ జట్టులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడానికి ప్రధాన కారణం రియాన్ పరాగ్. కెప్టెన్సీ కోసమే ఇదంతా డ్రామా
జరుగుతోంది. మేమంతా సంజుశాంసన్ వెనకే ఉంటాం. రాజస్థాన్‌ను విజయవంతంగా నడిపిస్తోన్న కెప్టెన్ సంజును పట్టించుకోకపోవడం సరికాదు’’