Play all audios:
కాళేశ్వరం ఆలయాన్ని గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం: కాళేశ్వరం ఆలయాన్ని గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి
చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సరస్వతి పుష్కరాల్లో భాగంగా హారతి కార్యక్రమంలో సీఎం, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పలువురు
ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కాళేశ్వరం అభివృద్ధి కోసం రూ.200 కోట్లు అయినా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సరస్వతి
పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగాన్ని సీఎం అభినందించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం తొలిసారిగా టెంట్ సిటీ ఏర్పాటు చేశామన్నారు. ‘‘త్వరలోనే గోదావరి,
కృష్ణా పుష్కరాలు కూడా రానున్నాయి. వచ్చే గోదావరి పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు కాళేశ్వరం క్షేత్రానికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తాం. గోదావరి, కృష్ణా పుష్కరాలు కూడా ఘనంగా నిర్వహించే
అదృష్టం నాకు కలగనుంది’’ అని సీఎం అన్నారు.