Play all audios:
Taiwan ఇంటర్నెట్‌డెస్క్: తైవాన్(Taiwan)కు అత్యంత సమీపంలో చైనా(China)కు చెందిన శక్తిమంతమైన జలాంతర్గాముల కదలికలు పెరిగాయి. తాజాగా గూగుల్ మ్యాప్స్‌లో ఈవిషయం వెల్లడైంది. తైవాన్ సమీపంలోని
చైనా నౌకాదళ స్థావరమైన క్వింగ్‌డావ్‌లో కనీసం ఆరు శక్తిమంతమైన జలాంతర్గాములు దర్శనమిచ్చాయి. ఎల్లోసీలో ఉన్న దీనిని చైనా తొలి సబ్‌మెరైన్ బేస్‌గా వ్యవహరిస్తారు. ఈ చిత్రాలను ఆస్ట్రేలియాకు చెందిన
నావికదళ నిపుణుడు అలెక్స్ లక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. జపాన్ సముద్రం, తూర్పు చైనా సముద్రజలాల్లోకి అత్యంత వేగంగా జలాంతర్గాములు ప్రవేశించేందుకు క్వింగ్‌డావ్ స్థావరం అనుకూలం. ఇక్కడ
రెండు టైప్ 091, 093ఏ జలాంతర్గాములు నిలుపగా.. మరో గుర్తుతెలియని సబ్‌మెరైన్ కూడా ఉంది. ప్రస్తుతం దానిని విచ్ఛిన్నం చేస్తుండి ఉంటారని పేర్కొన్నారు. ఇక అదే చిత్రంలో టైప్092 జలాంతర్గామి కూడా
కనిపిస్తోంది. దీని స్థానాన్ని సరికొత్త టైప్ 094తో భర్తీ చేయనున్నారు. చైనా దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న తైవాన్.. బీజింగ్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ తైవాన్ వార్షిక హన్‌కుయాంగ్
యుద్ధ విన్యాసాలు మొదలుపెట్టింది. ఇవి 14 రోజులపాటు జరగనున్నాయి. 2027లో చైనా ఆక్రమిస్తుందనే అంచనాలను దృష్టిలోపెట్టుకొని వీటిని నిర్వహిస్తున్నట్లు తైవాన్ రక్షణ మంత్రి వెల్లింగ్టన్ కూ
పేర్కొన్నారు. ఈ విన్యాసాల్లో తైవాన్ ఎం1ఏ2టీ ట్యాంక్‌లను, హిమార్స్ రాకెట్ వ్యవస్థ, యాంటీషిప్ మిసైల్ వ్యవస్థలను పరీక్షించడంతోపాటు లైవ్ ఫైర్‌డ్రిల్స్ కూడా నిర్వహించనుంది. * వాణిజ్య
యుద్ధానికి భయపడేదే లేదు - చైనా ఇటీవల తైవాన్ సమీపంలో రెండ్రోజుల పాటు చైనా యుద్ధ విన్యాసాలను నిర్వహించింది. ఈసందర్భంగా తైవాన్‌లోకి చైనా ట్యాంకులు వెళ్లడాన్ని సాధన చేసేలా పెద్ద తేలియాడే
వంతెనను నిర్మించారు. గతంలో చైనా దళాలు తైవాన్‌లో అడుగుపెట్టడంపై నిపుణుల్లో సందేహాలుండేవి. కానీ, సరికొత్త వంతెన వ్యవస్థ కారణంగా ఇప్పుడు అవి తేలిగ్గా ఆ ద్వీప దేశంలోకి అడుగుపెట్టగలవని
చెబుతున్నారు.