Play all audios:
Published by: Last Updated:February 27, 2021 9:59 PM IST PAWAN KALYAN - SHRUTI HASSAN: మీరేమైనా చెప్పండి! ఎన్నయినా చెప్పండి! అసలు ఇంకేమైనా కూడా అనుకోండి! బట్ పవన్ కల్యాణ్ ఆ విషయంలో
తోపు! అని గట్టిగా డిక్లేర్ చేసేస్తుంది శ్రుతిహాసన్ మీరేమైనా చెప్పండి! ఎన్నయినా చెప్పండి! అసలు ఇంకేమైనా కూడా అనుకోండి! బట్ పవన్ కల్యాణ్ ఆ విషయంలో తోపు! అని గట్టిగా డిక్లేర్
చేసేస్తుంది శ్రుతిహాసన్. కమల్ బిడ్డ శ్రుతి ఇప్పుడు ఇంకెవరితోనో లవ్‌లో ఉంది కదా. మరి పవన్ కల్యాణ్ సీన్‌లోకి యాడ్నుంచి వచ్చిండు అనే మీ డౌట్ అనుమానం మాకు అర్థమవుతోంది. అక్కడికే
వస్తున్నాం. రీసెంట్‌గా టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్. రవితేజ పక్కన ఆమె చేసిన క్రాక్‌కి మంచి డబ్బులు వచ్చాయి. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆమె వకీల్‌సాబ్‌లో కూడా
యాక్ట్ చేసింది. ఒరిజినల్ వకీల్‌సాబ్.. అదే అండీ.. పింక్‌లో అయితే హీరోకి జోడీ లేదు. బట్ నార్త్ వేరు కదా. అందుకే తమిళ్‌లో అజిత్‌కి విద్యాబాలన్‌ని జోడీగా పెట్టారు. తెలుగులో పవన్‌కి
జోడీగా శ్రుతిని ఫిక్స్ చేశారు. అదన్నమాట సంగతి. ఈ సినిమా ఏప్రిల్ 9న రిజీల్‌కి రెడీ అవుతోంది. దానికోసమే ఇప్పుడు శ్రుతి కూడా పవన్ కల్యాణ్‌ని పొగిడింది. పవన్ కల్యాణ్ లాంటి హోదా ఉన్న
మనిషి చెబితే, ఎవరైనా, ఏదైనా వింటారన్నది ఆమె మాట. అసలే పింక్ సబ్జెక్ట్ లో లేడీస్ మేటర్స్ ఎక్కువగా ఉంటాయి. సొసైటీలో లేడీస్ ఫేస్ చేస్తున్న ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేసిందీ
మూవీ. ఇలాంటి సబ్జెక్ట్ ని పవన్ కల్యాణ్‌లాంటి స్ట్రేచర్ ఉన్న స్టార్ చెబితే ఎక్కువగా జనాలకు రీచ్ అవుతుంది. ఆయన రీ ఎంట్రీకి ఇలాంటి సినిమాను సెలక్ట్ చేసుకోవడం సూపర్ అంటూ పొగడ్తలతో
ముంచెత్తింది శ్రుతి. advertisement అన్నట్టు ఈ సినిమాలో పవన్‌తో జోడీ కట్టిన శ్రుతి, తమిళ్‌లో విజయ్ సేతుపతితో లాభంలో యాక్ట్ చేస్తోంది. ఆ సినిమా కోసం రీసెంట్‌గా యాళా యాళా పాటను కూడా
పాడింది. రైతు సమస్యల మీద నడిచే స్టోరీ అది. Location : First Published : February 27, 2021 9:59 PM IST Read More