Ap icet results: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే..

Ap icet results: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే..

Play all audios:

Loading...

AP ICET Results| రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌-2025 ఫలితాలు (AP ICET Results) విడుదలయ్యాయి. By Features Desk Updated : 20 May 2025 17:12 IST Ee Font


size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE 1 min read విశాఖ, ఏయూ ప్రాంగణం: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌-2025 ఫలితాలు (AP ICET Results)


విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విశాఖలో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్, ఉన్నతాధికారులు విడుదల చేశారు. ఐసెట్‌ పరీక్ష 34,131మంది విద్యార్థులు రాయగా.. 32,719మంది క్వాలిఫై అయ్యారు.


ఈ పరీక్షలో 95.86శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు.  ఫలితాల కోసం


క్లిక్‌ చేయండి ఐసెట్‌ ఫలితాల్లో టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. ఐసెట్‌కు మొత్తంగా 37,572మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 94 పరీక్ష కేంద్రాల్లో మే 7న ఐసెట్‌ నిర్వహించగా.. 34,131మంది


పరీక్షకు హాజరయ్యారు. ఐసెట్‌లో 32,719మంది క్వాలిఫై కాగా.. వీరిలో 15,176మంది అబ్బాయిలు, 17,543మంది అమ్మాయిలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మనోజ్‌ మేకా (విశాఖ) అత్యధిక మార్కులతో ఒకటో


ర్యాంకు సాధించగా.. ఆ తర్వాత ర్యాంకుల్లో ద్వారకచర్ల సందీప్‌ రెడ్డి (వైఎస్‌ఆర్‌ కడప), ఎస్‌. కృష్ణసాయి (ఎన్‌టీఆర్‌ జిల్లా), వల్లూరి సాయిరాం సాత్విక్‌ (హైదరాబాద్‌), రేవూరి మాధుర్య (గుంటూరు),


షేక్‌ బషీరున్నీషా (అనకాపల్లి), వి. అజయ్‌ కుమార్‌ (తిరుపతి), భీశెట్టి హరి వెంకట ప్రసాద్‌ (తూర్పుగోదావరి), ఎస్‌. గణేశ్‌ రెడ్డి (విశాఖపట్నం), మహేంద్ర సాయి చామా (తిరుపతి) నిలిచారు. Published :


20 May 2025 16:53 IST గమనిక: _ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో


పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో


ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._