Cbse results: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌..

Cbse results: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌..

Play all audios:

Loading...

CBSE Class 12 results: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మీ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. By Features Desk Updated : 13 May 2025 14:38 IST Ee Font size


* ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE 2 min read దిల్లీ: దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE)


10, 12 తరగతుల ఫలితాలు వచ్చేశాయి. బోర్డు మంగళవారం ఈ రిజల్ట్స్‌ ప్రకటించింది. తొలుత 12వ తరగతి, ఆ తర్వాత 10వ తరగతి ఫలితాలను వెల్లడించింది. 10, 12వ తరగతుల ఫలితాల కోసం విద్యార్థులు తాము సాధించిన


స్కోరును CBSE.GOV.IN, CBSERESULTS.NIC.IN/ వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ, స్కూల్‌ నంబర్‌, అడ్మిట్‌ కార్డు నంబర్‌లను ఎంటర్‌ చేయడం ద్వారా ఫలితాలు చెక్‌


చేసుకోవచ్చు. అలాగే, డిజీలాకర్‌, ఉమాంగ్‌ మొబైల్‌ యాప్‌ల ద్వారా కూడా రిజల్ట్స్‌ పొందొచ్చు. (CBSE class 12 Results Announced)  10వ తరగతి ఫలితాల కోసం క్లిక్‌ చేయండి 12వ తరగతి ఫలితాల కోసం క్లిక్‌


చేయండి 12వ తరగతిలో అత్యధిక ఉత్తీర్ణత విజయవాడలోనే.. 12వ తరగతిలో 83.39శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. అమ్మాయిల్లో 91.64శాతం,


అబ్బాయిల్లో 85.70 శాతం మంది పాసయ్యారు. అత్యధికంగా విజయవాడలో 99.60శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఆ తర్వాత తిరువనంతపురంలో 99.32శాతం, బెంగళూరులో 95.95శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా


ప్రయాగ్‌రాజ్‌లో 79.53శాతం మంది పాసయ్యారు. మన దేశంలో 7,842 కేంద్రాలు, మరో 26 దేశాల్లో నిర్వహించిన సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలకు దాదాపు 42లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 24.12


లక్షల మంది పదో తరగతి పరీక్షలు, 17.88లక్షల మంది 12వ తరగతి పరీక్షలు రాశారు. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 4 మధ్య సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థుల్లో


అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు సీబీఎస్‌ఈ బోర్డు గత కొన్నేళ్లుగా మెరిట్‌ జాబితాలను వెల్లడించకూడదని నిర్ణయించిన విషయం తెలిసిందే. Published : 13 May 2025 11:33 IST గమనిక: _ఈనాడు.నెట్‌లో


కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు


లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._