Stock market: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల ఎఫెక్ట్‌: సెన్సెక్స్‌ 880 పాయింట్లు డౌన్‌.. మళ్లీ 80 వేల దిగువకు

Stock market: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల ఎఫెక్ట్‌: సెన్సెక్స్‌ 880 పాయింట్లు డౌన్‌.. మళ్లీ 80 వేల దిగువకు

Play all audios:

Loading...

Stock market | ముంబయి: భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. సరిహద్దు రాష్ట్రాలపై పాక్‌ దాడులకు యత్నించడంతో భారత్‌ వాటిని సమర్థంగా తిప్పికొట్టింది.


ఇవి మరింత తారస్థాయికి చేరొచ్చన్న భయాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు క్షీణించాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో వరుసగా రెండో రోజూ మన సూచీలు


నష్టపోయాయి. సెన్సెక్స్‌ 800 పాయింట్లకు పైగా నష్టపోయి.. మళ్లీ 80వేల దిగువకు చేరగా.. నిఫ్టీ 24వేల కాస్త ఎగువన ముగిసింది. భారత్‌-పాక్‌ నడుమ ఉద్రిక్తతల వేళ విమానయానం, టూరిజం, రియాల్టీ షేర్లు


అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అదే సమయంలో డిఫెన్స్‌ సంబంధిత స్టాక్స్‌లో కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. డ్రోన్ల తయారీ కంపెనీ ఐడియా ఫోర్జ్‌ షేర్లు ఏకంగా 18 శాతం మేర పెరిగాయి. నిఫ్టీ


మిడ్‌క్యాప్‌ సూచీ ఫ్లాట్‌గా ముగియగా.. స్మాల్‌క్యాప్‌ సూచీ 0.61 శాతం మేర నష్టోయింది. మార్కెట్‌ ఒడుదొడుకులను సూచించే ఇండియా విక్స్‌ 2.98 శాతం పెరిగి 21.63కు చేరింది. ఇంట్రాడేలో 8 శాతం వరకు


పెరిగింది. * Operation Sindoor LIVE updates: ఆపరేషన్‌ సిందూర్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌ సెన్సెక్స్‌ ఉదయం 78,968.34 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,334.81) నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా


నష్టాల్లోనే చలించింది. ఇంట్రాడేలో 78,968.34 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 880.34 పాయింట్ల నష్టంతో 79,454.47 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 265 పాయింట్ల నష్టంతో 24,008.00 వద్ద


ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 17 పైసలు బలపడి 85.41గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ


బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. టైటాన్‌, టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు రాణించాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 63 డాలర్ల వద్ద


కొనసాగుతుండగా.. బంగారం 3,329 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.