Play all audios:
Travelling To US | ఇంటర్నెట్ డెస్క్: విమానాల్లో ప్రమాదాల నివారణే లక్ష్యంగా అమెరికా రవాణా భద్రతా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడంతో పాటు భద్రతా చర్యలను
మరింత కట్టడి చేసేందుకు ట్రాన్స్‌పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (TSA), ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA)తో కలిసి కొత్త నియమాల్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అమెరికా విమానాల్లో
చెక్- ఇన్ లగేజీలో లిథియం బ్యాటరీతో నడిచే ఏడు రకాల వస్తువులపై నిషేధం విధించారు. ఇటీవల వాణిజ్య విమానాల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిని
క్యారీ-ఆన్ లగేజీలో తీసుకెళ్లే వెసులుబాటు ఉంది. నిషేధం వీటిపైనే.. * పవర్ బ్యాంక్‌లు * సెల్‌ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ కేస్‌లు * స్పేర్ లిథియం- అయాన్ బ్యాటరీలు * స్పేర్ లిథియం- మెటల్
బ్యాటరీలు * సెల్‌ఫోన్ బ్యాటరీలు * ల్యాప్‌ట్యాప్ బ్యాటరీలు * ఎక్స్‌టర్నల్ బ్యాటరీ ప్యాక్‌లు, పోర్టబుల్ రీఛార్జులు * భారీ నష్టాల్లో సూచీలు: సెన్సెక్స్ 873 పాయింట్లు డౌన్.. 24,700 దిగువకు
నిఫ్టీ లిథియం బ్యాటరీలకు వేడెక్కే స్వభావం ఉంటుందని ఎఫ్‌ఏఏ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. దీనివల్ల ‘థర్మల్ రన్ అవే’ అనే ప్రమాదకరమైన రసాయన రియాక్షన్‌కు కారణమవుతుందని వెల్లడించింది. ఓవర్
ఛార్జింగ్, సరిగ్గా ప్యాక్ చేయకపోవడం లేదా తయారీలో లోపాల కారణంగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని తెలిపింది. ముఖ్యంగా విమానంలోని కార్గోలో ఉన్నప్పుడు ప్రమాదానికి ఆస్కారం ఎక్కువ, దీనివల్ల ఇతర
బ్యాటరీలకు వేగంగా వ్యాపించి తీవ్రమైన అగ్ని ప్రమాదం సంభవించొచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న వస్తువుల్ని తీసుకెళ్లేందుకు వీలుండదు. వాటిని క్యారీ- ఆన్ లగేజీలో మాత్రమే తీసుకెళ్లాల్సి
ఉంటుంది. 2025 జనవరిలో ఎయిర్ బూసాన్ ఫ్లైట్ 391లో పవర్ బ్యాటరీ కారణంగా వ్యాపించిన మంటల్లో చిక్కుకుని ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. 2024 నవంబర్‌లో విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికుడి
ఫోన్ పేలడంతో సిబ్బంది తోటి ప్రయాణికుల్ని అప్రమత్తం చేశారు. దీంతో విమానంలో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి ప్రమాదాల నేపథ్యంలో లిథియం అయాన్ బ్యాటరీతో రూపొందించిన ఏడు
వస్తువులను లగేజీలో తీసుకెళ్లడంపై బ్యాన్ విధించడం గమనార్హం.