Play all audios:
Opera Neon: నియాన్ పేరిట కొత్త బ్రౌజర్‌ను ఒపెరా సంస్థ ఆవిష్కరించింది. దీని సాయంతో సులువుగా గేమ్స్, వెబ్సైట్లు సృష్టించవచ్చు. Opera Neon | ఇంటర్నెట్ డెస్క్: బ్రౌజర్ రంగంలో సరికొత్త
విప్లవాన్ని తీసుకొచ్చేందుకు ఒపెరా కంపెనీ సిద్ధమవుతోంది. అందులోభాగంగానే ‘ఒపెరా నియాన్’ (Opera Neon) పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత బ్రౌజర్‌ను ఆవిష్కరించింది. గేమ్స్ క్రియేట్
చేయడం, కోడ్లు రాయడం, వెబ్సైట్లు తయారుచేయగల సామర్థ్యంతో దీన్ని తీసుకురావడం విశేషం. * జూన్ 25 కల్లా మధ్యంతర ఒప్పందం! నియాన్ బ్రౌజర్ ప్రాంప్ట్‌ల ఆధారంగా టాస్క్‌లు పూర్తి చేస్తుంది. ఇది
క్లౌడ్ ఆధారిత ఏఐ సాయంతో ఉపయోగిస్తుంది. దీంతో మనుషులు ఆఫ్‌లైన్‌లో ఉన్నా టాస్కులు పూర్తి చేయగలదు. అంతేకాదు వీటికి మల్టీ టాస్క్ నిర్వహించగల సామర్థ్యం ఉంటుంది. సాధారణ ఏఐ సాధనాల కంటే ఇవికాస్త
భిన్నంగా ఉంటాయి. కోడింగ్, వెబ్సైట్లు రూపొందించడం వంటి డిజిటల్ పనులను సులువుగా చేసేస్తుంది. కొత్త ఒపెరా నియాన్ లాంచ్ తేదీ, సబ్స్క్రిప్షన్ ధర వివరాలను కంపెనీ ప్రకటించలేదు. బ్రౌజర్
ఆపరేటర్ ఫీచర్లో భాగంగా మార్చిలోనే ఒపెరా ఏఐ ఏజెంట్ టూల్‌ను ప్రవేశపెట్టింది. ఆన్లైన్ ఫారమ్‌లను పూరించడం, బుకింగ్‌లు పూర్తి చేయడం లాంటి టాస్క్‌లను నిర్వహిస్తోంది. అయితే ఈ ఏడాదిలో
తీసుకొచ్చిన ఎయిర్ బ్రౌజర్ తర్వాత ఇది ఐదో బ్రౌజర్.