Jammu kashmir: జమ్మూకశ్మీర్‌ సరిహద్దులో పాక్‌ లైవ్‌ షెల్‌.. ధ్వంసం చేసిన ఆర్మీ

Jammu kashmir: జమ్మూకశ్మీర్‌ సరిహద్దులో పాక్‌ లైవ్‌ షెల్‌.. ధ్వంసం చేసిన ఆర్మీ

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: జమ్మూకశ్మీర్‌ సరిహద్దు గ్రామంలో పాక్‌ ప్రయోగించిన ఓ లైవ్‌ షెల్‌ బయటపడింది. దీన్ని ఆర్మీ అధికారులు సమర్థమంతంగా ధ్వంసం చేశారు.  పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్‌


(Operation sindoor)తో మన బలగాలు దీటుగా బదులిచ్చాయి. అది జీర్ణించుకోలేని పాకిస్థాన్‌ (Pakistan).. జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల (Kashmir border villages) ప్రజలపై దాడులకు పాల్పడింది. ఈ


క్రమంలో మన సైన్యం వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాల్పుల విరమణ నేపథ్యంలో గ్రామాల ప్రజలు తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ఈక్రమంలోనే పాక్‌ ప్రయోగించిన లైవ్‌ షెల్‌ ఒకటి పూంఛ్‌లో


రోడ్డు పక్కన ఉండటాన్ని మంగళవారం గ్రామస్థులు గుర్తించారు. ఆ విషయాన్ని ఆర్మీ అధికారులకు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు దాన్ని పేల్చేశాయి. పాక్‌ చర్యలకు పూంఛ్ ప్రాంత ప్రజలు


ఎక్కువగా ప్రభావితమయ్యారు. అక్కడ 25 మంది ప్రాణాలు కోల్పోయారు.