Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. సైన్యం విడుదల చేసిన ప్రత్యేక వీడియో చూశారా?

Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. సైన్యం విడుదల చేసిన ప్రత్యేక వీడియో చూశారా?

Play all audios:

Loading...

పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు సంబంధించి భారత సైన్యం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం


పాకిస్థాన్‌ ఉగ్రస్థావరాలపై మే 7న ‘ఆపరేషన్‌ సిందూర్‌’(Operation Sindoor) పేరిట మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌, పీవోకేలోని ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేసి


శత్రు మూకలకు చుక్కలు చూపించింది. పహల్గాం ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం- సైన్యం చేపట్టిన చర్యలు, ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్షలు, ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌ భూభాగంలోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై


విధ్వంసం వంటి దృశ్యాలతో సైన్యం తాజాగా ప్రత్యేక వీడియోను రూపొందించి విడుదల చేసింది. అలాగే, ప్రపంచ దేశాల నుంచి భారత్‌కు లభించిన మద్దతు, సైన్యం పరాక్రమాన్ని ప్రశంసిస్తూ జవాన్లకు సంఘీభావంగా దేశ


ప్రజల ప్రదర్శనలు.. మీడియా క్లిప్పింగ్‌లు, ప్రముఖుల ట్వీట్లు, పాక్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ చేసిన పోస్టులు.. ఇలా ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై సమగ్ర సమాచారాన్ని క్రోడీకరిస్తూ చేసిన ఈ ప్రత్యేక


వీడియో మీకోసం..