Play all audios:
సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ (Khushbu Sundar) ‘ఎక్స్’ ఖాతా హ్యాక్‌కు గురైంది. శుక్రవారం రాత్రి నుంచి ఆమె ఎక్స్ ఖాతాలో వరుస సందేశాలు వస్తున్నాయి. చెన్నై: సినీ నటి, జాతీయ
మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ (Khushbu Sundar) ‘ఎక్స్’ ఖాతా హ్యాక్ అయింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆమె ఎక్స్ ఖాతాలో వరుస సందేశాలు పోస్ట్ అవుతున్నాయి. ఆయా మెసేజ్‌లు చూసిన నెటిజన్లు
ఆమె ‘ఎక్స్’ ఖాతా హ్యాకైందని భావించారు. ఈ క్రమంలోనే ఖుష్బూ దీనిపై క్లారిటీ ఇచ్చారు. తన ఇన్‌స్టా వేదికగా తాజాగా ఒక పోస్ట్ పెట్టారు. తన అకౌంట్ హ్యాకైందని.. హ్యాకర్ల నుంచి తనకు సందేశం కూడా
వచ్చిందని ఆమె చెప్పారు. * ‘బద్రి’కి పాతికేళ్లు: పవన్ చెప్పినా క్లైమాక్స్ మార్చని పూరి.. ఆసక్తికర విషయాలివే! ‘‘నా ఎక్స్ (ట్విటర్) ఖాతా హ్యాకైంది. ఎంత ప్రయత్నించినా లాగిన్ కాలేకపోతున్నా.
ఐడీ, పాస్‌వర్డ్ వివరాలను అది తీసుకోవడం లేదు. గడిచిన కొన్ని గంటల్లో నా పేజీలో పోస్ట్ అయిన ఏ సందేశం నాది కాదు. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. నా ఖాతాలో ఎలాంటి సందేశాలు వచ్చినా
దయచేసి అది నేను చేయలేదని గ్రహించండి. అప్పటి వరకూ ఇన్‌స్టా వేదికగా నేను అందరికి అందుబాటులో ఉంటా’’ అని ఆమె పోస్ట్ పెట్టారు. తన ఖాతాను హ్యాక్ చేసిన వ్యక్తి నుంచి తనకు వాట్సాప్ మెసేజ్
వచ్చిందని ఆమె తెలియజేశారు. హ్యాకర్ ఫోన్ నంబర్‌తోపాటు పంపిన సందేశాన్ని స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు. ‘‘హాయ్ ఖుష్బూ. నీ ట్విటర్ ఖాతాను నేనే హ్యాక్ చేశా. నీ ఖాతా మాకు ఏ విధంగాను
ఉపయోగపడుతుందనుకోను’’ అని అందులో రాసి ఉంది. ఈ సందేశాన్ని షేర్ చేసిన ఆమె.. ఈ విషయంపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు సైబర్ క్రైమ్ విభాగాన్ని కోరారు. అంతేకాకుండా హ్యాకర్ తన పేజీలో
క్రిప్టో కరెన్సీ గురించి పోస్టులు పెడుతున్నారని ఆమె చెప్పారు. తాను దానిని ప్రోత్సహించడం లేదని తెలిపారు. సెలబ్రిటీల సోషల్‌మీడియా ఖాతాలు హ్యాక్‌కు గురి కావడం ఇదేం తొలిసారి కాదు. ఇటీవల సింగర్
శ్రేయాఘోషల్, మంచు లక్ష్మి, త్రిష ఖాతాలు హ్యాక్ అయ్యాయి.