Play all audios:
జయం రవి (Ravi Mohan) కుటుంబ వివాదం రోజురోజుకీ ముదురుతోన్న విషయం తెలిసిందే. ఆయన తీరును తప్పుపడుతూ తాజాగా ఆర్తి తల్లి, నిర్మాత సుజాత విజయ్‌కుమార్ ఒక స్టేట్‌మెంట్ విడుదల చేశారు.
ఇంటర్నెట్‌డెస్క్: జయం రవి (Ravi Mohan) కుటుంబ వివాదం రోజురోజుకీ ముదురుతోన్న విషయం తెలిసిందే. ఆయన తీరును తప్పుపడుతూ తాజాగా ఆర్తి తల్లి, నిర్మాత సుజాత విజయ్‌కుమార్ ఒక స్టేట్‌మెంట్ విడుదల
చేశారు. రవి వల్లే తాను సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టానని అన్నారు. ఆయన్ని అల్లుడిలా కాకుండా తనయుడిగా చూశానని అన్నారు. నిర్మాతగా తాను అప్పుల పాలయ్యానని వెల్లడించారు. విషయం తెలిసినప్పటికీ ఆయన
మాత్రం ఏమాత్రం సాయం చేయలేదని ఆరోపించారు. ‘‘జయం రవి ఎన్నో అబద్ధాలు చెబుతున్నారు. ఆయన చేసే వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదు. అందుకే నేను మాట్లాడాల్సి వస్తోంది. తను ప్రోత్సహించడం వల్లే నేను
సినిమాల్లోకి వచ్చాను. నిర్మాతగా ‘అడంగ మరు’, ‘భూమి’, ‘సైరన్’ చిత్రాలను నిర్మించా. ఆయా చిత్రాల్లో తనే హీరోగా వర్క్ చేశాడు. ఈ సినిమాల కోసం ఫైనాన్షియర్ల నుంచి రూ.100 కోట్లు అప్పు తీసుకున్నా.
అందులో 25 శాతం తనకే పారితోషికంగా ఇచ్చా. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ నా వద్ద ఉన్నాయి. తనని నేను ఎప్పుడూ ఒక అల్లుడిలా చూడలేదు. కొడుకుగా భావించా. అతను ఎప్పుడూ బాధపడకూడదనుకున్నా. అప్పుల
వల్ల ప్రశాంతత లేని జీవితాన్ని గడిపా. నేను ఒక్కదాన్నే వడ్డీలు కట్టుకునేదాన్ని. నష్టాలను పూడ్చడానికి నా బ్యానర్‌లోనే మరో సినిమా చేస్తానని ‘సైరన్’ సమయంలో తను మాటిచ్చాడు. కానీ, ఏ చిత్రానికి
సంతకం చేయలేదు. అంతేకాకుండా, అప్పులు తీర్చడానికి సాయం చేస్తానని కూడా చెప్పలేదు. తను నన్ను అమ్మ అని ప్రేమగా పిలిచేవాడు. ఒక అమ్మగా ఈరోజు నేను కోరుకునేది ఒక్కటే.. తనని ఇంతకాలం ఒక హీరోగా చూశా.
కానీ, సానుభూతి పొందడం కోసం ఇప్పుడు అతడు చేసే ఆరోపణలు చూస్తుంటే బాధగా ఉంది. హీరో అనే భావన పోతోంది. అతను ఎప్పుడూ ఒక హీరోగానే ఉండాలని కోరుకుంటున్నా’’ అని స్టేట్‌మెంట్‌లో రాసుకొచ్చారు. * మీ
భాగస్వామికి కావాల్సిన లక్షణాలు రష్మికలో ఉన్నాయా?..: విజయ్ దేవరకొండ సమాధానమిదే విడాకులు తీసుకుంటున్నట్లు గతేడాది జయం రవి ప్రకటించారు. విడాకుల గురించి తనని సంప్రదించకుండానే ఆయన ప్రకటించారని
ఆర్తి ఆరోపించారు. ఈ క్రమంంలోనే వీరిద్దరూ గతేడాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు విచారణలో ఉంది. ఆర్తి తీరును తప్పుపడుతూ ఇటీవల ఆయన ఒక స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు.
‘‘నా భార్య, కుటుంబం కోసం అన్నివిధాలుగా సపోర్ట్ చేశా. ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురైన తర్వాత ఆర్తి నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నా. అంతేకానీ, నా పిల్లలను వదిలేయాలని ఎప్పుడూ అనుకోలేదు.
వాళ్ల కోసమే జీవిస్తున్నా’’ అని తెలిపారు. క్లిష్ట సమయంలో గాయని కెనీషా అండగా నిలిచిందన్నారు. ‘‘జీవితంలో నిరాశ, కన్నీళ్లు, బాధ మిగిలిన సమయంలో ఆమె నాకెంతో సపోర్ట్‌గా నిలిచింది. కట్టు బట్టలతో ఒక
రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వచ్చేసిన సమయంలో తనే నాకు తోడుగా నిలిచింది. తనొక అందమైన భాగస్వామి’’ అని చెప్పారు.