Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: తొలి సీజన్ (2008) తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌కు చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB) చేతిలో ఓటమి ఎదురైంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో తొలి పరాజయం. ఈ
క్రమంలో సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు ఎదురైన ప్రశ్నకు కాస్త ఆగ్రహం తెప్పించింది. చెన్నై బ్రాండ్ క్రికెట్ పాతబడిందనే వాదనను ఫ్లెమింగ్ కొట్టిపడేశాడు. రిపోర్టర్: తొలి మ్యాచ్‌లో 156
పరుగుల టార్గెట్‌ను 20వ ఓవర్ వరకూ తీసుకెళ్లారు. ఇప్పుడు 146 పరుగులే చేయగలిగారు. ఇది మీరు క్రికెట్ ఆడే విధానమని తెలుసు. కానీ, ఇది అవుట్‌డేట్ (పాతబడటం) అయిందని అనిపించడం లేదా? ఫ్లెమింగ్:
మా క్రికెట్ ఆడే తీరుపై మీ ఉద్దేశం ఏంటి? మీరు ఫైర్‌పవర్ గురించి మాట్లాడారు. మన దగ్గర ఫైర్ పవర్ అంతా ఉంది. మీ ప్రశ్న ఏంటో అర్థం కావడం లేదు. ఎందుకంటే మేం తొలి బంతి నుంచే స్వింగ్ చేయలేదు.
అలాగే అదృష్టం కూడా కలిసి రావాలి. అయితే, చివరికి విజేతగా ఎవరు నిలుస్తారనేది చూడాలి. మాది పాజిటివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. మమ్మల్ని తక్కువగా అంచనా వేయకండి. రిపోర్టర్: నేను మిమ్మల్ని తక్కువగా
అంచనా వేయడం లేదు. ఫ్లెమింగ్: మీరు అడిగింది సిల్లీగా అనిపిస్తోంది. సొంత మైదానం అడ్వాంటేజ్‌పై.. ‘‘గత కొన్నేళ్లుగా నేను చెపాక్ స్టేడియం గురించి చెబుతూనే ఉన్నా. ఇక్కడ హోం అడ్వాంటేజ్ అనేదే
ఉండదు. గతంలో ఇతర వేదికల్లో జరిగిన మ్యాచుల్లోనూ విజేతగా నిలిచాం. ప్రతి రోజూ ఇక్కడ మాకు కొత్త సవాలే. పిచ్‌ను అర్థం చేసుకొని సరైన జట్టును బరిలోకి దింపాల్సి ఉంది. కొన్నిసార్లు సరిగ్గా అంచనా
వేయలేకపోవచ్చు’’ అని ఫ్లెమింగ్ వెల్లడించాడు.