Play all audios:
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు ట్రేడ్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సుంకాల విధింపునకు యూఎస్‌లోని మరో కోర్టు అనుమతించింది (Trump Tariffs). ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలు అమలుకాకుండా ట్రేడ్ కోర్టు నిలుపుదల చేసింది. దీనిపై ట్రంప్ సర్కారు
అప్పీల్ దాఖలు చేసింది. గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.
దీనిపై జూన్ 5లోగా ఫిర్యాదుదారులు, జూన్ 9లోగా పరిపాలనాధికారులు స్పందించాలని తెలిపింది. * ట్రంప్ మధ్యవర్తిత్వంతోనే కాల్పుల విరమణ ఏప్రిల్ 2న ‘లిబరేషన్ డే’ పేరుతో ట్రంప్ పలు దేశాలపై
సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని, దేశ వాణిజ్య విధానం తన వెర్రి ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని కోరుకుంటున్నారంటూ న్యూయార్క్‌లోని అమెరికా
అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సుంకాల విధింపునకు కత్తెర వేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల
చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. సుంకాలకు సంబంధించి ప్రస్తుతం పలు దేశాలతో చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ట్రంప్
సర్కారు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ట్రేడ్ డీల్స్‌ను ఖరారు చేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఉందని, అప్పటివరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరింది. అయితే
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసిన అన్ని వాదనలను కోర్టు తిరస్కరించింది. ఈక్రమంలోనే చైనాతో వాణిజ్య సంధిని, భారత్-పాక్ మధ్య ఘర్షణలు పెంచుతుందని అధికారులు కోర్టులో వాదించారు. ‘‘టారిఫ్ అధికారం
వల్లనే ఇటీవల భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాధించగలిగారు’’ అని కోర్టుకు తెలిపారు. అయితే, ఈ వాదనలను కోర్టు తోసిపుచ్చింది.