Play all audios:
హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై తమ ప్రభుత్వ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. ఇంటర్నెట్‌డెస్క్: హార్వర్డ్ విశ్వవిద్యాలయం (Harward University)లో మొత్తం 31
శాతం మంది విదేశీ విద్యార్థులు ఉన్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయా విద్యార్థుల పేర్లు, దేశాల వివరాలు తమకు అందజేయాలని కోరారు. ఇటీవల
హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని అక్కడి ఫెడరల్ న్యాయమూర్తి అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ తన
నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ఆదివారం ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. ‘మొత్తం 31శాతం మంది విదేశీ విద్యార్థులున్నారనే విషయాన్ని హార్వర్డ్ ఎందుకు చెప్పడం లేదు. వారిలో అమెరికా వ్యతిరేక దేశాల
నుంచి వచ్చిన వాళ్లూ ఉన్నారు. ఆయా దేశాలు వారి విద్యార్థుల చదువు కోసం ఎలాంటి సొమ్ము చెల్లించడం లేదు. ఆ విదేశీ విద్యార్థుల వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. హార్వర్డ్ యూనివర్సిటీకి మేము
బిలియన్ డాలర్లు చెల్లించాం. వారి వివరాలు తెలుసుకోవాలనే మా అభ్యర్థన సరైనదే. మాకు ఆ విద్యార్థుల పేర్లు, దేశాల వివరాలు కావాలి. మీ దగ్గర రూ.442 కోట్లు ఉన్నాయిగా.. వాటినే ఉపయోగించుకోండి. డబ్బు
కోసం ఫెడరల్ ప్రభుత్వానికి ఎలాంటి విజ్ఞప్తులు చేయకండి’ అని ట్రంప్ రాసుకొచ్చారు. * 150 మందిని నమ్మించి.. ట్రంప్ పేరుతో స్కామ్! ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీకి అందించే నిధుల్లో ట్రంప్ కోత
విధించిన సంగతి తేలిసిందే. ఈ క్రమంలోనే గురువారం ఏకంగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ట్రంప్ చర్య అనైతికమని. నిబంధనలు ఉల్లంఘించడం అవుతుందని హార్వర్డ్ పేర్కొంది. ‘‘ఒక్క సంతకంతో యూనివర్సిటీలోని మొత్తం విద్యార్థుల్లో పావువంతు మందిని తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’
అని వెల్లడించింది. దీనిపై విచారణ జరిపిన ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి.. ట్రంప్ నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.