యాంకర్లు బస చేసిన హోటల్స్‌పై దృష్టి

యాంకర్లు బస చేసిన హోటల్స్‌పై దృష్టి

Play all audios:

Loading...

సాక్షి, మచిలీపట్నం: ‘బందరులో హైటెక్‌ వ్యభిచారం’ అనే శీర్షకన సాక్షిలో ప్రచురితమైన కథనం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఈ తరహా విష సంస్కృతి విస్తరిస్తుందన్న కథనం రాజకీయ, పోలీస్‌ వర్గాల్లో కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు సీరియస్‌గా తీసుకున్నారు. లోతైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని బందరు డివిజన్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన చిలకలపూడి పోలీసులు నగరంలోని లాడ్జీల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. యాంకర్లు బస చేసినట్టుగా ఆరోపణలు వచ్చిన హోటల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎంత కాలం క్రితం వచ్చారు. ఎందుకొచ్చారు. ఎన్ని రోజులున్నారో ఆరా తీశారు. మరొక వైపు పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఉన్న అపార్టుమెంట్లలో కూడా సోదాలు నిర్వహించారు. విచారణ జరుపుతున్నాం: రవీంద్రనాథ్‌బాబు, జిల్లా ఎస్పీ ప్రశాంతమైన బందరు నగరంలో హైటెక్‌ వ్యభిచారం జరిగే అవకాశాలు లేవు. సాక్షిలో వచ్చిన కథనంపై సమగ్ర విచారణ జరపుతున్నాం. ప్రత్యేక బృందాలతో నగరంలోని లాడ్జీలు, అపార్టుమెంట్లు సోదాలు చేస్తున్నారు.

సాక్షి, మచిలీపట్నం: ‘బందరులో హైటెక్‌ వ్యభిచారం’ అనే శీర్షకన సాక్షిలో ప్రచురితమైన కథనం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఈ తరహా విష సంస్కృతి విస్తరిస్తుందన్న కథనం రాజకీయ,


పోలీస్‌ వర్గాల్లో కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు సీరియస్‌గా తీసుకున్నారు. లోతైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని బందరు డివిజన్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు.


వెంటనే రంగంలోకి దిగిన చిలకలపూడి పోలీసులు నగరంలోని లాడ్జీల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. యాంకర్లు బస చేసినట్టుగా ఆరోపణలు వచ్చిన హోటల్స్‌పై ప్రత్యేక దృష్టి


పెట్టారు. ఎంత కాలం క్రితం వచ్చారు. ఎందుకొచ్చారు. ఎన్ని రోజులున్నారో ఆరా తీశారు. మరొక వైపు పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఉన్న అపార్టుమెంట్లలో కూడా సోదాలు నిర్వహించారు. విచారణ జరుపుతున్నాం:


రవీంద్రనాథ్‌బాబు, జిల్లా ఎస్పీ ప్రశాంతమైన బందరు నగరంలో హైటెక్‌ వ్యభిచారం జరిగే అవకాశాలు లేవు. సాక్షిలో వచ్చిన కథనంపై సమగ్ర విచారణ జరపుతున్నాం. ప్రత్యేక బృందాలతో నగరంలోని లాడ్జీలు,


అపార్టుమెంట్లు సోదాలు చేస్తున్నారు.