Play all audios:
Reported by: Published by: Last Updated:June 26, 2023 7:47 PM IST ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ మాటకారితనం ఎంతో ముఖ్యం..! మాటలు.. జాగ్రత్తగా ఉంటే.. అవి బంగారు మూటలు.? ఏ మాత్రం నోరు జారితే
ప్రమాదం కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఎవరితో ఎలా మాట్లాడాలి అంటే..? ANAND MOHAN, NEWS18, VISAKHAPATNAM మనిషికి, జంతువులకు ఉన్న ఒకే ఒక్క వ్యత్యాసం అదే మాట.. అయితే నోరు ఉంది.. ఏది పడితే
అది మాట్లాడితే కుదరదు.. ఆ నోరు నాలుగు మెప్పించే మాటలు ఆడాలి. ఆ మాట మంచిగా ఉండాలి. అర్థం అవ్వాలి. అలాగే ఉన్న విషయాన్ని పక్కాగా.. పర్ఫెక్ట్ గా చెప్పగలగాలి. అంటే.. ఆ జ్ఞానం కూడా కేవలం మాటల రూపం
నుంచే వ్యక్తం కావాలి. అంటే మాట ఎంత విలువైనదో అర్ధం అవుతుందా..? ఎంత మంచి మాటలాడితే.. ఎంత అర్ధమైనట్టు మాట్లాడితే.. ఎంత తక్కువ మాటల్లో ఎక్కువ అర్ధం చూపగలిగితే.. అదే నిజమైన నేర్పు. ఒక్కమాటలో
చెప్పాలంటే మాటకారితనం. మనిషికి అతని మాట్లాడే విధానంలో కూడా ఒక పద్ధతి ఉండాలి. మాటే మంత్రము అని ఓ సినీకవి అన్నాడు. అనువు కాని చోట అధికులమనరాదు అని వేమన కవి అన్నాడు. advertisement చక్కగా
మాట్లాడటానికి పెద్దగా చదువులు అవసరం లేదు. మాట్లాడటం కూడా ఓ కళే. ఎదుటివారి విజ్ఞత పరిజ్ఞానం అభిరుచి దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా మాట్లాడాలి. మాటలు ఎదుటివారికి సులభంగా అర్ధమయ్యేలా సరళంగా
ఉండాలి. ఉపమానాలు ఉదాహరణలు సరిపోయే విధంగా ఉండాలి. సమయం అందరికీ విలువైనదే. అతి భాషణం వలన టైం వృధా అవుతుంది. సెల్ ఫోన్లు వచ్చాక మాటల బాతాఖానీ పెరిగింది. అర్జంటైతే ఎప్పుడైనా చెప్పొచ్చు.. ఆ విషయం
మటుకు. మనకి సమయం ఉందికదా అని అవతలి వ్యక్తితో సాధారణ విషయాలు అతిగా ఫోన్లో మాట్లాడకూడదు.. ఆ వ్యక్తి పనుల్లో బిజీగా ఉండవచ్చు. అతిగా మాట్లాడటం అనర్ధదాయకం. ఎవ్వరినీ నిందించకూడదు. మనల్ని మనం
పొగుడుకో కూడదు, నిందించుకో కూడదు కూడా. మన పరువు, మన ఇంటి పరువును కాపాడే విధంగా మాట్లాడాలి.. మన వ్యక్తిత్వానికి మచ్చ రాకుండా చూసుకోవాలి. మాట్లాడే కళ తెలిసినవారు మాత్రమే ఇన్స్యూరెన్స్
ఏజెంట్లుగా, లాయర్లుగా బాగా రాణిస్తారు. advertisement భార్యతో సంభాషించడం కూడా ఓ కళే. నెగెటివ్ ను పాజిటివ్ గా మార్చి చెప్పాలి. లేకపోతే యుద్ధమే. ఉదాహరణకి ఆమె కట్టిన లేదా కొన్న చీర బాగులేకపోయినా
ఓ చిన్న డిజైన్ ఎంత బాగుందో అంటే చాలు మురిసిపోతుంది. అవతలి వ్యక్తితో మనకున్న రిలేషన్ ని బట్టి మాట్లాడాలి. మనం ఏం మాట్లాడినా, ఏం చెప్పినా, ఏం రాసినా.. చెప్పదలుచుకున్న విషయం సింపుల్ గా సూటిగా
కొంత హ్యూమర్ మిక్స్ అయివుండాలి. అప్పుడే మనకో విలువ, ఓ గుర్తింపు, ఓ ప్రత్యేకత ఉంటాయి ఇతరుల దృష్టిలో. మరి మాటల్లో మీ నైపుణ్యం చూపించండి మరి. Location : Visakhapatnam,Andhra Pradesh First
Published : June 26, 2023 7:43 PM IST Read More