Play all audios:
Instamart | దిల్లీ: స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ పేరు మారింది. ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి చెందిన ఈ క్విక్ కామర్స్ సంస్థ తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌గా గుర్తింపు పొందే దిశగా అడుగులు వేస్తోంది.
ఇందులో భాగంగా తన మాతృ సంస్థ స్విగ్గీ పేరును తొలగించింది. మరో ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇప్పటికే ఎటర్నల్‌గా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. బ్లింకిట్ పేరిట క్విక్ కామర్స్‌ను, జొమాటో
పేరుతో ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో స్విగ్గీ నుంచి ఈ నిర్ణయం వెలువడింది. తమ ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని ఇన్‌స్టామార్ట్ ఎప్పటికైనా అధిగమిస్తుందని స్విగ్గీ గ్రూప్ సీఈఓ
శ్రీహర్ష మజేటి పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇన్‌స్టామార్ట్‌కంటూ ప్రత్యేక బ్రాండ్‌గా గుర్తింపు తీసుకురావాలని ఆ కంపెనీ భావిస్తోంది. తొలుత తమ యాప్‌లోనే ఇన్‌స్టామార్ట్ బటన్‌ను
ప్రత్యేకంగా అందించిన స్విగ్గీ.. తర్వాత ఇన్‌స్టామార్ట్ కోసం ప్రత్యేకంగా స్టాండలోన్ యాప్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజా మార్పులో భాగంగా ఇన్‌స్టామార్ట్ కొత్త లోగోను ఆవిష్కరించింది.
పేరులో స్విగ్గీని తొలగించినప్పటికీ.. స్విగ్గీ ఎస్-పిన్ ఐకాన్‌ను మాత్రం కొనసాగించింది. విజువల్‌గానే ఈ మార్పు అని.. తర్వాత స్విగ్గీ నమ్మకం అలానే కొనసాగుతుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
యాప్‌లో లోగోను మార్చిన ఆ కంపెనీ.. ప్యాకింగ్, డెలివరీ బ్యాగ్, కమ్యూనికేషన్, క్యాంపెయిన్ వంటి విషయాల్లో త్వరలో ఈ మార్పు కనిపిస్తుందని చెప్పింది.