Whatsapp: వాట్సప్‌ వాయిస్‌ చాట్‌ ఫీచర్‌.. ఇకపై అన్ని గ్రూపులకూ

Whatsapp: వాట్సప్‌ వాయిస్‌ చాట్‌ ఫీచర్‌.. ఇకపై అన్ని గ్రూపులకూ

Play all audios:

Loading...

WhatsApp: సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని గ్రూప్‌లకు వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సప్‌ తెలిపింది. WhatsApp | ఇంటర్నెట్‌ డెస్క్‌: తక్షణ సందేశం పంపాలన్నా, ఫొటోలు


పంచుకోవాలన్నా వెంటనే గుర్తుకువచ్చే మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్‌ (WhatsApp). ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, అప్‌డేట్లను యూజర్లకు పరిచయం చేస్తుంటుందీ యాప్‌. గ్రూప్‌ కాల్స్‌ కోసం ప్రత్యేకంగా


తీసుకొచ్చిన వాయిస్‌ చాట్స్‌ (voice chats) ఫీచర్‌ని తాజాగా విస్తరించింది. ఇప్పటివరకు ఎక్కువ సభ్యులున్న గ్రూపులకు మాత్రమే పరిమితమైన ఈ సేవలు ఇకపై అన్ని గ్రూపులకు జోడించింది. వాట్సప్‌ తొలుత 


వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ను 33 మందికి పైబడి సభ్యులున్న గ్రూపులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని గ్రూపులకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తాజాగా


తెలిపింది. గ్రూప్‌లోని వ్యక్తులు ఎవరైనా ఈ ఫీచర్‌ని వినియోగించుకోవచ్చని పేర్కొంది. గ్రూప్‌ చాట్‌ ఓపెన్‌ చేసి కింద నుంచి స్వైప్‌ చేస్తే Swipe up to chat అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని కొన్ని


సెకన్ల పాటు హోల్డ్‌ చేస్తే వాయిస్‌ చాట్స్‌ ఫీచర్‌ ఎనేబల్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. మిగిలిన సభ్యులందరికీ రానున్న వారాల్లో


వినియోగంలోకి రానుంది. * 1,11,000 డాలర్లకు బిట్‌కాయిన్‌ సాధారణంగా ఉండే గ్రూప్‌ కాల్స్‌కు ఈ ఫీచర్‌ కాస్త భిన్నం. వాట్సప్‌ గ్రూప్‌ కాల్‌ వస్తే.. గ్రూప్‌లోని సభ్యులందరికీ నోటిఫికేషన్‌తో పాటు


రింగ్‌టోన్‌ వస్తుంది. కానీ ఈ ఫీచర్‌ సాయంతో వాట్సప్‌ నుంచి గ్రూప్‌ కాల్స్‌ వస్తే ఎలాంటి రింగ్‌ రాదు. గ్రూప్‌లోని సభ్యులందరికీ కేవలం సైలెంట్‌ నోటిఫికేషన్‌ మాత్రమే స్క్రీన్‌పై


ప్రత్యక్షమవుతుంది. దీంతో వాయిస్‌ చాట్‌లో పాల్గొనాలనుకొనేవారు కాల్‌ ముగిసేలోగా ఎప్పుడైనా జాయిన్‌ అవ్వొచ్చు. వాయిస్‌ చాట్‌లో పాల్గోని వారు కూడా కాల్‌లో పాల్గొన్నవారి ప్రొఫైల్‌ను చూడొచ్చు.


అంతేకాదు ఇందులో వాయిస్ చాట్‌ల్లోనూ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో తీసుకొచ్చింది.