Iqoo neo 10: 7000mah బ్యాటరీతో ఐకూ నియో 10 గేమింగ్ ఫోన్‌

Iqoo neo 10: 7000mah బ్యాటరీతో ఐకూ నియో 10 గేమింగ్ ఫోన్‌

Play all audios:

Loading...

iQOO Neo 10 | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ ఐకూ మరో కొత్త మోడల్‌ను దేశీయ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. నియో సిరీస్‌లో 10ను (iQOO Neo 10) తాజాగా తీసుకొచ్చింది. గేమింగ్


ప్రియులను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ విడుదల చేసింది. 144 ఎఫ్‌పీఎస్‌ గేమింగ్‌తో ఈ సెగ్మెంట్‌లో వస్తున్న తొలి ఫోన్‌ తమదేనని కంపెనీ పేర్కొంది. దీంతో పాటు 7000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 120W ఫాస్ట్‌


ఛార్జింగ్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. నియో 10 స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 1.5K అమోలెడ్‌ స్క్రీన్‌తో వస్తోంది. 144Hz రిఫ్రెష్‌ రేటు ఉంది. 5,500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది.


స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 4 ప్రాసెసర్‌ ఉంది. గేమింగ్‌ కోసం క్యూ1 చిప్‌సెట్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 15తో వస్తోంది. ఇందులో 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 882 ప్రధాన కెమెరా


ఇచ్చారు. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ లభిస్తోంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా ఉంది. ముందు వైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ముందూ, వెనుక కెమెరాలో 4k వీడియోలు రికార్డ్ చేయొచ్చు.


గేమింగ్‌ సమయంలో ఫోన్‌ ఓవర్‌ హీట్‌ కాకుండా 7000mm sq వ్యాపర్‌ ఛాంబర్‌ థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ ఉంది.  * నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే ఐకూ నియో 10లో 7000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 120W


ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వస్తోంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సర్‌, ఐపీ 65 రేటింగ్‌ ఉన్నాయి. బరువు 206 గ్రాములు. ఇక ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.


8జీబీ+128జీబీ వేరియంట్‌ రూ.31,999కు లభిస్తుంది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ రూ.33,999, 12జీబీ+256జీబీ వేరియంట్ రూ.35,999గా నిర్ణయించారు. హైఎండ్‌ వేరియంట్‌ 16జీబీ+512జీబీ స్టోరేజీతో వస్తోంది.


దీని ధరను రూ.40,999గా నిర్ణయించారు. ప్రీ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. జూన్‌ 3 నుంచి అమెజాన్‌, ఐకూ ఇండియా ఈ స్టోర్లలో లభ్యమవుతుంది.