Stock market: నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 200 పాయింట్లు డౌన్‌

Stock market: నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 200 పాయింట్లు డౌన్‌

Play all audios:

Loading...

Stock Market Opening Bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.


దీంతో తొలుత స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్ఫీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లలో విక్రయాలు సూచీలను కిందకు లాగుతున్నాయి. ఉదయం 9:25


గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 195 పాయింట్ల నష్టంతో 81,134 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 45 పాయింట్ల నష్టంతో 24,611 వద్ద ఉన్నాయి.  సెన్సెక్స్‌ 30 సూచీలో.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌,


పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎంఅండ్‌ఎం, ఎటర్నల్‌, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌,  ఐటీసీ షేర్లు నష్టాల్లో


ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం


విలువ 85.55 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ 64.55 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు 3,153 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. * ట్రంప్‌తో అంబానీ సమావేశం! అమెరికా ప్రధాన


సూచీలైన నాస్‌డాక్, ఎస్‌ అండ్‌ పీ 500 నిన్నటి ట్రేడింగ్‌ సెషన్‌లో లాభంతో ముగియగా.. డోజోన్స్ ఫ్లాట్‌గా ముగిసింది. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియన్‌


ఏఎస్‌ఎస్‌ 0.14 శాతంతో ఫ్లాట్‌గా ట్రేడవుతుంటే.. జపాన్‌ నిక్కీ 1.11 శాతం, షాంఘై 0.48 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్‌ మాత్రం 0.34 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) తిరిగి


కొనుగోలుదారులుగా నిలిచారు. బుధవారం నికరంగా రూ.932 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా.. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.316 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.