Vedanta: ఈశాన్య రాష్ట్రాల్లో వేదాంత గ్రూప్ భారీ పెట్టుబడి

Vedanta: ఈశాన్య రాష్ట్రాల్లో వేదాంత గ్రూప్ భారీ పెట్టుబడి

Play all audios:

Loading...

వేదాంత గ్రూప్‌ ఈశాన్య ప్రాంతంలో చమురు & గ్యాస్, కీలకమైన ఖనిజాలు, ఇతర రంగాలలో రూ. 30,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ‘వేదాంత గ్రూప్’ ఈశాన్య రాష్ట్రాల్లో గ్యాస్, ఖనిజాలు, చమురు శుద్ధి


సౌకర్యాలు, విద్యుత్, ఆప్టికల్ ఫైబర్, సిస్టం ఇంటిగ్రేషన్, పునరుత్పాదక ఇంధనం, ప్రసార రంగాలు, డేటా సెంటర్లలో రూ. 30,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఈ రోజు(శుక్రవారం) ప్రకటించింది. ఈ


పెట్టుబడితో వేదాంత గ్రూప్‌..అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ, మిజోరాం అంతటా విస్తరించి; చమురు, గ్యాస్, కీలకమైన ఖనిజాలు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలపై దృష్టి సారిస్తుంది. ఈ


పెట్టుబడుల వల్ల ఆయా ప్రాంతాల్లో 1 లక్ష ఉద్యోగాల కల్పనతో పాటు ఆర్థిక వృద్ధి జరుగుతుందని, సామాజిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయని సంస్థ తెలిపింది. ఈశాన్య ప్రాంతంలో హైడ్రోకార్బన్లకు


సంబంధించి..వేదాంత అతిపెద్ద అన్వేషణ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. చమురు, గ్యాస్ నుంచి కీలకమైన ఖనిజాల వరకు అత్యంత అద్భుతమైన సహజ వనరులు, ప్రతిభావంతులైన మానవ వనరుల అసాధారణమైన సమూహాన్ని


కలిగి ఉన్న ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి సంస్థ పూర్తిగా కట్టుబడి ఉందని వేదాంత గ్రూప్ చైర్మన్ ‘అనిల్ అగర్వాల్’ అన్నారు. వేదాంత, దాని అనుబంధ సంస్థలు అస్సాం నుంచి మేఘాలయకు 1,000 మెగావాట్ల


విద్యుత్తును సరఫరా చేయడానికి అనుమతించే 300 సర్క్యూట్ కే.ఎం. ట్రాన్స్మిషన్ సిస్టం నెట్‌వర్క్‌లో కూడా పెట్టుబడులు పెట్టాయి. ఈ ప్రాజెక్ట్ మేఘాలయ, అస్సాంలో విద్యుత్ సౌకర్యాలను గణనీయంగా


మెరుగుపరుస్తుంది.