Play all audios:
నగరంలోని అఫ్జల్‌గంజ్ సమీపంలోని మహారాజ్‌గంజ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. బేగంబజార్ (హైదరాబాద్): నగరంలోని అఫ్జల్‌గంజ్ సమీపంలోని
మహారాజ్‌గంజ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
సమీపంలోని దుకాణాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఈ భవనంలోని మొదటి రెండు అంతస్తులను ప్లాస్టిక్ డిస్పోజబుల్ గ్లాసులు, ప్లేట్లు, ఇతర సామగ్రిని నిల్వచేసే గోదాములుగా
వినియోగిస్తున్నారు. మూడో అంతస్తులో ఓ కుటుంబం నివాసముంటోంది. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభంలో షార్ట్‌సర్క్యూట్ జరగడంతో భవనంలో మంటలు చెలరేగాయి. గోదాముల్లో తేలికపాటి సామగ్రి ఉండటంతో సులువుగా
పైకి వ్యాపించాయి. దీంతో మూడో అంతస్తులోని కుటుంబసభ్యులు కేకలు వేశారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్ బృందాలు ఐదు ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్నారు. మూడో అంతస్తులో
ఉన్న ఓ చిన్నారి సహా ఐదుగురిని క్రేన్ సాయంతో సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంతో పరిసరాల్లో పొగ దట్టంగా అలముకుంది.