Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం

Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం

Play all audios:

Loading...

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) సమీపంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సూట్‌కేస్‌లో ఒక మహిళ మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. ఈ ఘటన రైల్వే బ్రిడ్జ్‌ సమీపంలో చోటు చేసుకుంది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని చందాపుర రైల్వే బ్రిడ్జ్ సమీపంలో ఒక సూట్‌కేస్‌ను స్థానికులు గుర్తించారు. దాన్ని తెరచి చూడగా గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటపడింది. దీనిపై


సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వేరే ప్రాంతంలో హత్య చేసి రైలులో నుంచి ఇక్కడ విసిరేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఆ మహిళ ఎవరు, ఏ ప్రాంతానికి


చెందింది అనే వివరాలు తెలియాల్సి ఉంది. * మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.