Gangers: ఓటీటీలోకి యాక్షన్‌ కామెడీ మూవీ: ‘గ్యాంగర్స్‌’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Gangers: ఓటీటీలోకి యాక్షన్‌ కామెడీ మూవీ: ‘గ్యాంగర్స్‌’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Play all audios:

Loading...

సుందర్‌ సీ, వడివేలు, కేథరిన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘గ్యాంగర్స్‌’. ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వీయ దర్శకత్వంలో సుందర్‌ సీ (Sundar C) నటించిన సినిమా


‘గ్యాంగర్స్‌’ (Gangers). కేథరిన్‌ (Catherine Tresa), వాణీ భోజన్‌, వడివేలు కీలక పాత్రలు పోషించారు. ఈ యాక్షన్‌ కామెడీ మూవీ తమిళ్‌లో ఏప్రిల్‌ 24న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా


తమిళ్‌తోపాటు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో సందడి చేయనుంది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో గురువారం (మే 15) నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. * ‘కాలింగ్‌ బెల్‌’ ఎందుకు కొడతారో


తెలుసా?: ఆసక్తిగా ట్రైలర్‌ తమిళనాడులోని ఓ నగరంలో జరిగే కథ ఇది. ఓ విద్యార్థిని కనిపించకుండా పోవడంతో.. టీచర్‌ సుజిత (కేథరిన్‌) పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఓ పోలీస్‌ ఆఫీసర్‌.. ఆ స్కూల్‌


పీటీగా అండర్‌ కవర్‌లో వస్తాడు. పోలీస్‌ అధికారి రాకతో అసలు పీటీ (వడివేలు) పరిస్థితి ఏంటి? ఇన్వెస్టిగేషన్‌ ఎలా సాగింది? తదితర ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపొందింది.