Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా రూపొందిన హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమా తొలి భాగం
ఈ నెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది. చెన్నైలో ఇటీవల సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించిన టీమ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు
సిద్ధమవుతోంది. తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ క్రీడా మైదానంలో ఈ నెల 8న (Hari Hara Veera Mallu Pre Release Event Date) వేడుక నిర్వహించనున్నారు. 7వ తేదీన పవన్ కల్యాణ్ తిరుపతికి చేరుకోనున్నారు.
తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. * పవన్ సూచన.. ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించిన ‘హరిహర వీరమల్లు’ నిర్మాత ముందుగా ఈ చిత్రాన్ని క్రిష్ డైరెక్ట్ చేయగా.. ఆ తర్వాత ఆ
దర్శకత్వ బాధ్యతలను జ్యోతి కృష్ణ తీసుకున్నారు. ఎప్పుడో ప్రారంభమైన ఈ సినిమా కొవిడ్, పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడం తదితర కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. మేలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను
పూర్తి చేసిన పవన్ కల్యాణ్.. కొన్ని రోజుల క్రితం డబ్బింగ్ కంప్లీట్ చేశారు. ఏకధాటిగా నాలుగు గంటల్లో పూర్తి చేయడం విశేషం. బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు
పోషించారు.