Telugu movies this week: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే

Telugu movies this week: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే

Play all audios:

Loading...

‘నాయకుడు’ మూవీకి మించి ‘థగ్‌లైఫ్‌’ ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి ‘థగ్ లైఫ్’తో (Thug Life) వస్తున్నానని అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ అన్నారు. ఆయన కీలక పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన


చిత్రమిది. శింబు, త్రిష, అభిరామి కీలక పాత్రల్లో నటించారు. ‘నాయకన్‌’ (1987) లాంటి హిట్‌ తర్వాత కమల్‌ - మణిరత్నం కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.


గ్యాంగ్‌స్టర్‌, యాక్షన్‌ డ్రామాగా మణిరత్నం దీన్ని తీర్చిదిద్దారు. జూన్‌ 5న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ------------------------- ఎట్టకేలకు వస్తున్న నార్నె నితిన్‌ ఫస్ట్‌ మూవీ


  ‘మ్యాడ్‌’, ‘ఆయ్‌’, ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ చిత్రాలతో ఇప్పటికే విజయాల్ని అందుకున్న నార్నె నితిన్‌ కథానాయకుడిగా రూపొందిన తొలి చిత్రం ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’. సంపద కథానాయిక. సతీశ్‌ వేగేశ్న


దర్శకత్వం వహిస్తున్నారు. చింతపల్లి రామారావు నిర్మాత. ‘ప్రేమ, కుటుంబ నేపథ్యంలో సాగే మంచి మూవీ ఇది’ అని చిత్ర బృందం చెబుతోంది. 2022లోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఎట్టకేలకు జూన్‌ 6న


ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ------------------------- ఈసారి నవ్వులు ఐదు రెట్లు.. కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ‘హౌస్‌ఫుల్‌’ చిత్రాలు బాలీవుడ్‌లోనే నాలుగు భాగాలను రూపొందించిన మొట్టమొదటి


ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సినీ ప్రియులందరినీ మరోసారి కామెడీతో అలరించడానికి ‘హౌస్‌ఫుల్‌5’ సిద్ధమైంది. అక్షయ్‌ కుమార్‌, అభిషేక్‌ బచ్చన్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, జాక్వెలిన్‌


ఫెర్నాండేజ్‌, సోనమ్‌ బజ్వా, నర్గీస్‌ ఫక్రీ, సంజయ్‌ దత్‌, జాకీ ష్రాఫ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. మునుపటి


భాగాలకు పూర్తి భిన్నంగా మరింత నవ్వులు పంచేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ------------------------- మిస్టరీ ఎంటర్‌టైనర్‌తో సంతోష్‌ శోభన్‌.. ‘మ్యాడ్‌’,


‘మ్యాడ్‌ స్క్వేర్‌’ చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో సంగీత్‌ శోభన్‌. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంబ్లర్స్‌’ (Gamblers). చైతన్య దర్శకత్వం వహించిన ఈ


సినిమా జూన్‌ 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘ఇదొక మిస్టరీ ఎంటర్‌టైనర్‌.. ఇందులోని థ్రిల్లింగ్‌ అంశాలు, ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది ఆకట్టుకుంటుంది’


అని చిత్ర బృందం చెబుతోంది. ------------------------- నవ్వుల రైడ్‌లా.. మహేశ్‌ చింతల, విద్యాసాగర్‌ కారంపురి, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రధారులుగా శంకర్‌ చేగూరి తెరకెక్కించిన చిత్రం


‘బద్మాషులు’. బి.బాలకృష్ణ, సి.రామశంకర్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా జూన్‌ 6న థియేటర్లలోకి రానుంది. నవ్వుల రైడ్‌లా సాగిపోయే సినిమాగా ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.


------------------------- ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలివే! * నెట్‌ఫ్లిక్స్‌ * వన్‌ ఆఫ్‌ దెమ్‌ డేస్‌ (హాలీవుడ్‌) - జూన్‌ 04 * జాబ్‌ (హిందీ) - జూన్‌ 05 * అమెజాన్‌ ప్రైమ్‌ * స్టోలెన్‌ (హిందీ)


- జూన్‌ 04 * జియో హాట్‌స్టార్‌ * టూరిస్ట్‌ ఫ్యామిలీ (తమిళ/తెలుగు) - జూన్‌ 02 * గజానా (హిందీ) - జూన్‌ 02 * దేవికా అండ్‌ డానీ (తెలుగు సిరీస్‌) - జూన్‌ 06