Play all audios:
Puri Musings || (ఇంటర్నెట్‌డెస్క్): మానవజాతి వలసలు ఎలా మొదలయ్యాయి? వివిధ ఖండాల నుంచి భారత్‌కు మనుషులు ఎలా వలస వచ్చారు? అనే విషయాలను ‘మైగ్రేషన్’ అనే టాపిక్ ద్వారా పంచుకున్నారు దర్శకుడు
పూరి జగన్నాథ్. వలసవాదం కారణంగా రకరకాల మనుషులు, భాషలు, సంస్కృతులు పుట్టాయని తన పాడ్‌కాస్ట్ ‘పూరి మ్యూజింగ్స్’లో పేర్కొన్నారు. వలసలు వద్దంటే, దండయాత్రలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు.
‘‘జెనిటిక్ స్టడీస్, ఆర్కియాలజీ రిపోర్ట్స్, ఫాజిల్ ఎవిడెన్స్ ప్రకారం 65వేల సంవత్సరాల కిందట ఒక ఆఫ్రికన్ గ్రూప్ బయలుదేరి ఎర్ర సముద్రం, పర్షియా, అఫ్గానిస్థాన్ దాటి మెల్లగా భారత్
చేరుకుంది. వారిని ఏన్షియంట్ హంటర్ గ్యాదరర్స్ (Ancient Hunter Gatherers) అంటారు. వీరు ముందు ఉత్తర భారతానికి చేరుకుని అక్కడి నుంచి మెల్లగా దక్షిణ భారతానికి వచ్చారు. ఆ తర్వాత శ్రీలంక,
అండమాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా వరకూ వ్యాపించారు. అందులో కొంతమంది ఒక ద్వీపంలో స్థిరపడి అక్కడకు ఎవరు వచ్చినా చంపేయడం మొదలు పెట్టారు. ప్రపంచం మారిన విషయం ఇప్పటికీ వాళ్లకు
తెలియదు. వాళ్లింకా హంటర్ గ్యాదరర్స్‌గానే మిగిలిపోయారు. అదే సెంటినల్ ద్వీపం (Sentinel Island). మన అండమాన్‌లోనే ఉంది’’ ‘‘ఆ తర్వాత 10000BC లో పశ్చిమాసియా నుంచి అంటే.. ప్రస్తుత ఇజ్రాయెల్,
పాలస్తీనా, లెబనాన్, జోర్డాన్, సిరియా నుంచి మరో గ్రూప్ ఇండియాకు చేరుకుంది. వాళ్లు మిడిల్ ఈస్ట్ ప్రీ ఫార్మర్స్ (Middle East Pre Farmers). వీళ్లకు సగం సగం వ్యవసాయం తెలుసు. ఎన్నో విత్తనాలు
పట్టుకుని ఇక్కడకు వచ్చారు. కానీ, ఏ సీజన్‌లో ఏ నెలలో ఏ విత్తనం పండుతుందో వాళ్లకు తెలియదు. స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, కుక్కల్ని పెంచడం మొదలు పెట్టారు. ఉన్నచోటే వ్యవసాయం చేస్తూ ఎలా
బతకాలి? అని చాలా తపన పడ్డారు. ఫర్టయిల్ క్రిసెంట్ (Fertile Crescent) గురించి చదువుకుంటే, ఇంకా వివరాలు తెలుస్తాయి’’ * మనం బతికేది బతుకు కాదు.. మనకంటే కాకి మేలు: పూరి జగన్నాథ్ ‘‘ఇక
3000బీసీలో యురేషియా నుంచి స్టెప్ హెర్డర్స్ (Steppe Herders) వచ్చారు. ప్రస్తుత ఉక్రెయిన్, కజికస్థాన్, ఇరాన్‌కు చెందినవారు. వీళ్లకు గుర్రపుస్వారీ వచ్చు. ఆవుల్ని.. మేకల్ని పెంచారు.
వ్యవసాయంపై పట్టుంది. నల్లని జుట్టు, గోధుమ రంగు కళ్లు కలిగిన వాళ్లు. వీళ్లది నోమాడిక్ స్టైల్. చిన్న చిన్న టెంట్స్‌లో బతుకుతూ మెల్లగా ఇండియాకు చేరుకున్నారు. కేవలం మగాళ్లు మాత్రమే వచ్చారు.
ఉత్తర భారతంలో ఉన్న హంటర్ గ్యాదరర్స్‌కీ ప్రీ ఫార్మర్స్‌కి పుట్టిన వాళ్లు అప్పటికే సింధులోయలో స్థిరపడ్డారు. ఈ స్టెప్ హెర్డర్స్ వచ్చి ఇండస్ వ్యాలీలో ఉన్న వాళ్లతో కలిశారు. వాళ్లకీ,
ఇక్కడున్న వీళ్లకూ పుట్టిన వాళ్లే ఆర్యులని జెనిటిక్ సాక్ష్యాలు చెబుతున్నాయి’’ ‘‘ఉత్తర భారతం వాళ్లు కొంచెం తెల్లగా, దక్షిణాది వాళ్లు నల్లగా ఉండటానికి కారణం.. సౌతిండియా డీఎన్‌ఏలో హంటర్
గ్యాదరర్స్ శాతం ఎక్కువ. వీరినే ద్రవిడియన్స్ అని పిలుస్తారు. దక్షిణాది ప్రజలు అప్పటికే ఒక బలమైన భాషను మాట్లాడటం మొదలు పెట్టారు. అదే తమిళ్. సంస్కృతం కన్నా తమిళ భాష పురాతనమైనదని చెబుతారు. ఇక
ఇండో ఆర్యన్ గ్రూప్ నుంచే హిందీ, ఉర్దూ, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ, రాజస్థానీ, భోజ్‌పురి, ఒడియా, సింధీ భాషలు పుట్టాయి. హంటర్ గ్యాదరర్స్ నుంచి తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం పుట్టాయి.
మానవ వలసవాదంలో రకరకాల మనుషులు, భాషలు, సంస్కృతులు పుట్టాయి’’ ‘‘అందరం ఆఫ్రికా నుంచే బయలుదేరాం. కానీ, మనుషులు చెదిరిపోయి రకరకాలుగా మారిపోయాం. చైనా వాళ్లు మనల్ని చూసి ‘వీళ్లేంటి నల్లగా ఉన్నారు’
అనుకుంటారు. మనం వాళ్లను చూసి ‘పొట్టిగా చింపిరి కళ్లతో ఉన్నారు’ అనుకుంటాం. మన పిల్లల్ని మనమే గుర్తు పట్టలేం. మన వారసులను మనమే శత్రువుల్లా చూస్తాం. అది వేరే జాతి అనుకుంటాం. ప్రకృతిలో
ఒదిగిపోతూ, మారిపోతూ ఎన్నో రంగులు పులుముకుంటూ అనుక్షణం మనిషి మారిపోతూనే ఉన్నాడు. ‘నేనే ముందు, నాదే నిజం’ అంటూ వారసులతో ఎప్పుడూ గొడవ పడుతూ బతుకుతారు. ప్రపంచంలో వలసవాదం ఎప్పుడూ ఆగదు. వ్యాపారం
పేరుతో ఒకడు, బతుకుదెరువు కోసం ఇంకొరు వస్తారు. వద్దు అంటే, వలసవాదం దండయాత్రలా మారిపోతుంది’’ అని పూరి జగన్నాథ్ అభిప్రాయపడ్డారు.