Rohit - kohli: రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌.. ఇంగ్లాండ్‌కు పెద్ద బూస్ట్: మొయిన్ అలీ

Rohit - kohli: రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌.. ఇంగ్లాండ్‌కు పెద్ద బూస్ట్: మొయిన్ అలీ

Play all audios:

Loading...

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ముంగిట రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికారు. ఇది తమ జట్టుకు కలిసొస్తుందని ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అన్నాడు. ఇంటర్నెట్ డెస్క్:


ఐదు టెస్టుల సిరీస్‌ కోసం జూన్‌లో టీమ్‌ఇండియా (Team India) ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌తోనే 2025-2027 డబ్ల్యూటీసీ ప్రారంభంకానుంది. అయితే, ఇటీవల స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ


(Rohit Sharma), విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. వీరిద్దరూ లేకపోవడం తమ జట్టుకు పెద్ద బూస్ట్‌ను ఇస్తుందని ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అన్నాడు. కోహ్లీ (Virat Kohli)


రిటైర్మెంట్ ప్రకటించడం టెస్టు క్రికెట్‌కు పెద్ద దెబ్బ అని పేర్కొన్నాడు. ‘కచ్చితంగా ఇది (రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్) ఇంగ్లాండ్‌కు పెద్ద బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నా. ఈ ఇద్దరు అగ్రశ్రేణి


ఆటగాళ్లకు ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం ఉంది. టీమ్ఇండియా చివరగా ఇక్కడకు వచ్చినప్పుడు రోహిత్ బాగా ఆడినట్లు నాకు గుర్తుంది. రోహిత్, కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. వారు


రిటైర్ కావడం భారత జట్టుకు తీరని లోటు. కోహ్లీ వీడ్కోలు పలకడం టెస్టు క్రికెట్‌కు పెద్ద దెబ్బ. అతను ఒక మార్గదర్శకుడు, టెస్ట్ క్రికెట్‌కు ఎంతో సేవ చేశాడు. భారత్‌లో మరింత మెరుగ్గా రాణించాడు.


అప్పట్లో సచిన్ తెందూల్కర్‌ను చూడటానికి స్టేడియాలకు అభిమానులు పోటెత్తెవారు. తర్వాత అది కోహ్లీకే సాధ్యమైంది. అతని పేరిట అద్భుతమైన రికార్డులున్నాయి. కోహ్లీ ఆడుతుంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది.


చాలా పోటీతత్వంతో ఆడతాడు. అద్భుతమైన కెప్టెన్ కూడా. అతను రిటైర్ అవడం టెస్టు క్రికెట్‌కు పెద్ద దెబ్బ’ అని మొయిన్ అలీ అన్నాడు.