Play all audios:
ఇంటర్నెట్‌డెస్క్: ఉత్తరకొరియా (North Korea) ఇటీవల 5వేల టన్నుల సామర్థ్యమున్న విధ్వంసక నౌకను రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) దీన్ని
ప్రారంభించేందుకు వెళ్లారు. అయితే ఈక్రమంలోనే అది దెబ్బతింది. ఈమేరకు అక్కడి అధికార మీడియా వివరాలు వెల్లడించింది. చోంగ్జిన్ ఓడరేవులో ఈ యుద్ధనౌక ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి
స్వయంగా కిమ్ హాజరయ్యారు. ఆయన యుద్ధనౌకను ప్రారంభిస్తున్న సమయంలో ర్యాంపు నుంచి జారిపోయి.. ఫ్లాట్ కార్ కదలకపోడంతో నౌక అడుగుభాగం దెబ్బతింది. దీన్ని కిమ్ తీవ్రంగా పరిగణించారు. సైనికాధికారులు,
శాస్త్రవేత్తలు, షిప్‌యార్డ్ నిర్వాహకులపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే ఇలా జరిగిందంటూ వారిపై విరుచుకుపడ్డారు. దేశ గౌరవానికి భంగం కలిగిందని వ్యాఖ్యానించారు.
జూన్‌లో జరిగే పార్టీ కీలక సమావేశానికి ముందు దీన్ని పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. * ఇక అంతరిక్షంలో యుద్ధాలు! ఈ 5వేల టన్నుల సామర్థ్యమున్న యుద్ధనౌకను గత నెలలో ఉత్తరకొరియా
రూపొందించింది. తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకోవడంలో ఇది మరో పెద్ద ముందడుగని అక్కడి అధికార మీడియా పేర్కొంది. అణు సామర్థ్య బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో సహా వివిధ ఆయుధ వ్యవస్థలను
నిర్వహించడానికి దీన్ని రూపొందించినట్లు కిమ్ పేర్కొన్నారు. దీన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో నౌకాదళానికి అప్పగించాలని ఆయన నిర్ణయించుకున్నారు.