Italy: ఒక్కసారిగా బద్దలైన అగ్నిపర్వతం.. పరుగులు పెట్టిన పర్యాటకులు

Italy: ఒక్కసారిగా బద్దలైన అగ్నిపర్వతం.. పరుగులు పెట్టిన పర్యాటకులు

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటలీ (Italy)లోని సిసిలీ తూర్పు తీరంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం (Mount Etna volcano) ఒక్కసారిగా బద్దలైంది. దీంతో భారీగా బూడిద ఎగసిపడుతోంది. అగ్నిపర్వతం బద్దలవ్వడంతో


పర్యాటకులు భయంతో పరుగులు పెట్టారు. పర్యాటకులను, సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదకరమైన వాయువులు విడుదల అవుతుండడంతో ప్రజలంతా మాస్కులు


ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో మౌంట్ ఎట్నా ఒకటని ఇటలీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వోల్కనాలజీ


వెల్లడించింది. గత ఐదేళ్లుగా ఇది చురుకుగా ఉన్నట్లు పేర్కొంది.  కొన్ని గంటలుగా అగ్నిపర్వతం నుంచి బూడిద ఎగసిపడుతూనే ఉందని.. ఇలాగే కొనసాగితే మరిన్ని విస్ఫోటనాలు సంభవించే ప్రమాదం ఉందని ఆందోళన


వ్యక్తం చేసింది.