Manchu manoj: రాజకీయాల్లోకి మంచు మనోజ్ ఎంట్రీ.. ఏ పార్టీలో చేరనున్నారంటే?

Manchu manoj: రాజకీయాల్లోకి మంచు మనోజ్ ఎంట్రీ.. ఏ పార్టీలో చేరనున్నారంటే?

Play all audios:

Loading...

Published by: Last Updated:December 16, 2024 7:26 PM IST MANCHU MANOJ: ప్రముఖ నటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక రెడ్డి త్వరలో రాజకీయ రంగంలోకి అడుగు


పెట్టబోతున్నారు. MANCHU MANOJ: రెండు తెలుగు రాష్ట్రాలోనే కాకుండా యావత్ సినీ ఇండస్ట్రీకి ఇప్పుడు మంచు ఫ్యామిలీ గొడవనే హాట్ టాపిక్‌గా మారింది. మంచు ఇంటి గొడవ పొగమంచులా రాజకీయాల్లోకి కూడా


చొరబడింది. మంచు ఫ్యామిలీ రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక రెడ్డి త్వరలో రాజకీయ రంగంలోకి అడుగు


పెట్టబోతున్నట్లు సమాచారం. మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక రెడ్డి జనసేన లేదా టీడీపీలో చేరే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మనోజ్, మౌనిక తమ రాజకీయ ప్రస్థానం ప్రారంభించేందుకు నంద్యాల నుండి


ముందుకు వస్తారని సమాచారం. ఈ సందర్భంగా, భూమా ఘాట్ వద్ద వారు తమ రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించే అవకాశం ఉందని మౌనికరెడ్డి సన్నిహితులు చెప్తున్నారు. ఇటీవల మంచు కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాల


నేపథ్యంలో, రాజకీయంగా బలపడాలనే ఆశతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా, భారీ కాన్వాయ్‌తో వెళ్లిన వారు శోభా


నాగిరెడ్డి చిత్రపటానికి నివాళి అర్పించనున్నారు. వారి రాజకీయ ప్రయాణం కోసం వారు ఓ పార్టీలో చేరాలని భావిస్తున్నారని, రాజకీయంగా బలపడితే తమకు కొంత భరోసా దొరుకుతుందని మనోజ్ భావిస్తున్నట్లు


సమాచారం. advertisement జనసేన లేదా టీడీపీలో చేరాలి? ప్రస్తుతం, ఆళ్లగడ్డ నుండి తెలుగుదేశం పార్టీ తరపున మౌనిక సోదరి అఖిలప్రియ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. 2014-2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా


ఉన్న సమయంలో, అఖిలప్రియ పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. మంచు మనోజ్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. దీంతో, ఆయన జనసేన లేదా టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నారని వార్తలు


వస్తున్నాయి. advertisement ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆ తరువాత, ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ, 2019 ఎన్నికలకు ముందు


వైఎస్ఆర్‌సీపీలో చేరారు. మోహన్ బాబు కుటుంబం ఒక సందర్భంలో ప్రధాని మోదీని కూడా కలిసింది. Location : Hyderabad,Telangana First Published : December 16, 2024 7:26 PM IST Read More