Crime news: విద్యార్థిని చేతిలో నంబర్‌ రాసి కాల్‌ చేయాలని వేధింపులు.. కీచక ప్రొఫెసర్‌ అరెస్టు

Crime news: విద్యార్థిని చేతిలో నంబర్‌ రాసి కాల్‌ చేయాలని వేధింపులు.. కీచక ప్రొఫెసర్‌ అరెస్టు

Play all audios:

Loading...

దేహ్రాదూన్‌: విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ కీచక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (55)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్‌(Uttarakhand) రూర్కీలోని ప్రభుత్వ డిగ్రీ


కళాశాలలో చోటుచేసుకుంది. ఘటనపై బాధితుల ఫిర్యాదు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అబ్దుల్‌ అలీమ్‌ అన్సారీ 12 మంది విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు.


గురువారం మధ్యాహ్నం బీఎస్సీ ప్రాక్టికల్‌ పరీక్షల వైవా సమయంలో కొందరు విద్యార్థినులను అనుచితంగా తాకాడు. ఒక విద్యార్థిని అరచేతిపై తన మొబైల్ నంబర్‌ను రాసి.. ఇంటికి వెళ్లాక తనకు కాల్‌ చేయాలని


చెప్పాడని గ్యాంగ్‌ నహర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్కే సక్లానీ వెల్లడించారు. బాధితురాలు గది నుంచి బయటకు వచ్చాక తనకు ఎదురైన దారుణమైన పరిస్థితిని తోటి విద్యార్థులతో చెప్పగా.. ఇతర


విద్యార్థులు సైతం ఆ ప్రొఫెసర్ తమ పట్ల ఎలా అనుచితంగా ప్రవర్తించారో వెల్లడించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. తను చెప్పిన మాట వినకపోతే మార్కులు తగ్గిస్తానంటూ బెదిరించేవాడని విద్యార్థులు


వాపోయారు.  * రూ.9.04 కోట్ల నగదు.. రూ.23.25 కోట్ల ఆభరణాలు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సదరు ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన తెలిపారు. దీంతో  


విద్యార్థుల ఆగ్రహాన్ని నివారించేందుకు కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. బాధితుల్లో కొందరు విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్సారీని పోలీసులు అరెస్టు చేశారు.  పోలీసులు తమ శైలిలో


విచారించగా.. విద్యార్థినులను తాకినట్లు అన్సారీ అంగీకరించాడు. అయితే, ఈ చర్య వెనుక తనకు ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవని చెప్పాడు.  విద్యార్థిని అరచేతిలో మొబైల్‌ నంబర్‌ రాశారా? అని అడిగిన ప్రశ్నకు


సరైన సమాధానం చెప్పలేదని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అన్సారీ బుధ, గురువారాల్లో నిర్వహించిన రెండు ప్రాక్టికల్‌ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.