Play all audios:
జగిత్యాల: హనుమాన్ జయంతి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు (Kondagattu)కు భక్తులు భారీగా తరలివచ్చారు. అంజన్నను దర్శించుకునేందుకు వర్షంలోనూ కాలినడకన చేరుకుంటున్నారు. ఆంజనేయస్వామి
మాలధారులు దీక్షా విరమణ చేస్తున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున కొండగట్టులో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ
అశోక్‌కుమార్ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లను కలెక్టర్ పరిశీలించారు.