Cji gavai: రాజ్యాంగమే సర్వోన్నతమైనది - సీజేఐ జస్టిస్‌ గవాయ్‌

Cji gavai: రాజ్యాంగమే సర్వోన్నతమైనది - సీజేఐ జస్టిస్‌ గవాయ్‌

Play all audios:

Loading...

మూలస్తంభాలుగా ఉన్న వ్యవస్థలన్నీ కలిసి పని చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఉద్ఘాటించారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల కంటే భారత రాజ్యాంగమే


(Constitution of India) సర్వోన్నతమైనదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఉద్ఘాటించారు. మూలస్తంభాలుగా ఉన్న ఈ వ్యవస్థలన్నీ కలిసి పని చేయాలని అన్నారు. 52వ సీజేఐగా బాధ్యతలు


చేపట్టిన ఆయన.. మహారాష్ట్ర, గోవా బార్‌కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమంలో మాట్లాడారు. భారత్‌ పురోగతి సాధించడమే కాకుండా ఆర్థిక, సామాజిక రంగాల్లోనూ అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు.


‘‘న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థ, పార్లమెంటు కంటే భారత రాజ్యాంగమే సర్వోన్నతమైనది. మూలస్తంభాలుగా ఉన్న ఈ మూడు విభాగాలు రాజ్యాంగం ప్రకారం కలిసి పని చేయాలి. ఇందులోని అన్ని వ్యవస్థలు సహకారం


అందించుకుంటూ పరస్పరం గౌరవించుకోవాలి. రాజ్యాంగ మౌలిక స్వరూపం పటిష్ఠంగా ఉంది’’ భారత ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను గతంలో ఇచ్చిన 50 కీలక తీర్పులతో రూపొందించిన పుస్తకాన్ని


సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ (CJI Justice Gavai) ఆవిష్కరించారు. * రాష్ట్రపతికి కాలపరిమితులు నిర్దేశించొచ్చా?.. ఆ అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? మహారాష్ట్రకు చెందిన జస్టిస్‌ గవాయ్‌.. సీజేఐగా బాధ్యతలు


స్వీకరించిన తర్వాత తొలిసారి రాష్ట్రంలో పర్యటించారు. బీఆర్‌ అంబేడ్కర్‌ స్మారకమైన చైత్యభూమి సందర్శించి నివాళులు అర్పించారు.