Play all audios:
ఇంటర్నెట్‌డెస్క్: ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసేందుకు నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ (operation sindoor)లో మన సైన్యానికి చెందిన త్రివిధ దళాలు ఎంతో సమన్వయంతో వ్యవహరించాయి. కచ్చితత్వంతో
లక్ష్యాలను ఛేదించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మన బలగాలు ఎక్స్ వేదికగా షేర్ చేస్తున్నాయి. తాజాగా భారత వాయుసేన (Indian Air Force) కూడా ఆ తరహా వీడియోను పంచుకుంది. ‘‘ఎల్లప్పుడూ దృఢ
సంకల్పంతో స్పందిస్తాం’’ అంటూ తన సంసిద్ధత, సామర్థ్యాన్ని ప్రదర్శించింది. వైమానిక దళ విన్యాసాలు, కమాండర్ల వేగవంతమైన ప్రతిస్పందన ఎలా ఉంటుందో అందులో చూపించారు. దేశ రక్షణ సమయంలో తేడా వస్తే
పర్జన్య గర్జనే (మేఘంలా గర్జిస్తాం) అని చాటిచెప్పేలా ఉన్న ఆ దృశ్యాలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తోన్న గీతం దేశభక్తిని రగిలిస్తోంది.