Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: మాజీ రాష్ట్రపతి, మిసైల్‌మ్యాన్ ఆఫ్ ఇండియా ఎ.పి.జె.అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) జీవితం తెరపైకి రానుంది. ‘కలాం’ టైటిల్‌తో ఆయన బయోపిక్‌ను ‘ఆదిపురుష్’ ఫేమ్ ఓం రౌత్
తీసుకొస్తున్నారు. కలాం పాత్రలో ధనుష్ (Dhanush) నటించనున్నారు. ఈ మేరకు ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఈ సినిమాని ప్రకటిస్తూ చిత్ర బృందం పోస్టర్‌ను విడుదల చేసింది. అభిషేక్ అగర్వాల్, అనిల్
సుంకర, భూషణ్‌కుమార్, కృష్ణన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.