Devi prasad: షూటింగ్‌లో వర్ధమాన నటుడిని చావబాదిన సీనియర్‌ కమెడియన్‌..

Devi prasad: షూటింగ్‌లో వర్ధమాన నటుడిని చావబాదిన సీనియర్‌ కమెడియన్‌..

Play all audios:

Loading...

‘‘నేను కో-డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఓ సినిమాలో ఓ సీనియర్ హాస్యనటుడి పక్కన నటించటానికి మరో హాస్య నటుడు అవసరమయ్యాడు. అంతకుముందు ఈవీవీ సత్యనారాయణ గారి సినిమాలలో నటించిన నాకిష్టమైన వర్ధమాన


నటుడు గుర్తుకొచ్చారు. ఆయన ఆంధ్రాలో ఉద్యోగం చేస్తుంటారని తెలుసుకొని ఫోన్ చేసి పిలిపించాము. అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లోని స్ట్రీట్ సెట్‌లో షూటింగ్. 300 అడుగుల నిడివిని దాటి ఉండే ఆ


సన్నివేశాన్ని ఒకే షాట్‌లో చిత్రీకరించాలని దర్శకుడి నిర్ణయం. ఒక క్యాన్‌లో 400 అడుగుల నెగెటివ్ మాత్రమే ఉంటుంది.(ఇప్పటిలా డిజిటల్ కాదు) షాట్ మధ్యలో కట్ చేయవలసి వస్తే మళ్లీ మరో కొత్త క్యాన్‌


లోడ్ చేయాల్సిందే. ఆ విషయం ఇద్దరు నటులకూ చెప్పి డైలాగ్ రిహార్సల్స్ చేయించారు దర్శకుడు. టేక్ చేస్తూ దర్శకుడు యాక్షన్ చెప్పగానే సీనియర్ నటుడు హుషారుగా అవసరం లేకున్నా వర్ధమాన నటుడిని ఎడాపెడా


కొడుతూ డైలాగ్స్ చెబుతుంటే, ఆ నటుడు నాలుగైదు డైలాగుల తరువాత తడబడి ఆగిపోతున్నారు’’ ‘‘వెంటనే ఆ సీనియర్ ‘ఎక్కడి నుంచీ తెచ్చారండీ ఇతన్ని.. టైమింగ్ లేదూ ఏమీ లేదూ’ అంటూ విసుక్కొన్నారు. మళ్లీ కొత్త


నెగెటివ్ క్యాన్‌ లోడ్ చేసి టేక్‌కు సిద్ధమయ్యాం.  ఈసారి సీనియర్ నటుడు రెచ్చిపోయి చేస్తుంటే మొత్తానికి అయ్యిందనిపించాడా వర్ధమాన నటుడు. సన్నివేశం తృప్తిగా రాకపోయినా సమయాన్ని, నెగెటివ్‌ని


దృష్టిలో పెట్టుకుని దర్శకుడు షాట్ ఓకే చెయ్యవలసి వచ్చింది’’ ‘‘ఆ తర్వాత కొద్దిసేపటికి మేకప్ రూముకు వెళ్లిన నాతో ఆ వర్ధమాన నటుడు ‘వెరీ సారీ దేవీ గారు.. మీరెంతో అభిమానంతో నన్ను పిలిపిస్తే నేను


బాగా నటించలేకపోయాను. ఆ సీనియర్ నటుడు షాట్‌లో విపరీతంగా నన్ను కొడుతూ డైలాగులు చెబుతుంటే నా ఏకాగ్రత మొత్తం పోయింది’ అంటూ బాధపడుతుంటే ఆయన కంట్లో కన్నీటిపొర స్పష్టంగా కనిపించింది. ఆయన షర్ట్


విప్పి వీపును చూపిస్తే షాకయ్యాను. చేతి వేళ్ల అచ్చులు ఎర్రగా ముద్రలు పడిపోయి ఉన్నాయి. ‘షాట్ జరుగుతున్నప్పుడే విషయం మాకు అర్థమైందండీ బాధపడకండి’ అని ఓదార్చాను’’ ‘‘అంతకు కొన్నేళ్లు వెనక్కి


వెళితే, అదే సీనియర్ హాస్యనటుడు ఓ రోజు భోజనాల సమయంలో కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని నాతో పంచుకున్నాడు. ఓ హీరో శాడిజంతో తనతో ఆడుకొని తన ఆత్మ స్థైర్యాన్ని ఎలా దెబ్బతీశాడో


బాధపడ్డారు నాకు తెలుసు. జరిగింది నిర్మాత గారికి చెబితే ఆయన ‘ఆ సీన్ మళ్లీ రీషూట్ చెయ్యండి ఫరవాలేద’న్నారు. మళ్లీ ఓరోజు షూట్ పెట్టి ఆ వర్ధమాన నటుడికే కాల్ చేస్తే ఆయన ఎందుకొచ్చిన తంటా


అనుకొన్నారో ఏమో నాకు సెలవు దొరకట్లేదండి అని చెప్పేశారు. ఆ స్థానంలో మరొక రెగ్యులర్ కమెడియన్‌ని పెట్టి రీషూట్ ప్రారంభించాం’’ ‘‘ఈసారి దర్శకుడు ఆ సీనియర్ హాస్య నటుడికి ఎందుకు రీషూట్ చేయవలసి


వచ్చిందో చెప్పి ‘పక్క ఆర్టిస్ట్‌ని వెకిలిగా ఒక్క దెబ్బ కూడా వేయటానికి వీల్లేదు’ అని చెప్పారు. పక్క ఆర్టిస్ట్‌తో ‘ఒకవేళ ఆయన గనక నిన్ను కొడుతూ డైలాగ్స్ చెబితే నువ్వు కూడా ఆయనకి రెండు తగిలించి


డైలాగ్స్ చెప్పు’ అన్నారు నవ్వుతూనే. అవాక్కయిన ఆ సీనియర్ కొంతసేపటికి తేరుకున్నాక, స్వతహాగా అద్భుతమైన నటుడు గనుక సింగిల్ షాట్‌లో అద్భుతంగా నటించారు. చెప్పొచ్చేదేమిటంటే.. కళాకారులు, రచయితలు


అందరూ సున్నితమైన మనసు కలిగి వారని తరచూ చెప్పే మాట కొందరి విషయంలో మాత్రమే నిజం. వాళ్లూ మామూలు మనుషులే. ఈర్ష్య అసూయ ద్వేషాలు వాళ్లకీ సహజం. సకల కళలన్నింటినీ మించిన కళ ఒకటుంది. స్థాయీ భేదాలు,


కుల, మత, ప్రాంతీయ భేదాలేవీ పరిగణించక సాటి ‘మనిషి’ని ‘మనిషి’గా చూసే కళ అది. ఆ కళ పేరు ‘మానవత్వం’. అతి తక్కువమంది మనుషులకు మాత్రమే అబ్బే అరుదైన కళ’’ - దర్శకుడు, నటుడు దేవీ ప్రసాద్. స్వీయ


అనుభవాలను నుంచి..