Play all audios:
జాన్వీకపూర్ (Jahnvi kapoor)ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ దర్శకుడు. ఆమెను ఎంతోమంది ట్రోల్ చేశారని అన్నారు. ఇంటర్నెట్‌డెస్క్: జాన్వీ కపూర్ (Jahnvi kapoor), ఇషాన్
ఖట్టర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘హోమ్‌బౌండ్’ (Homebound). నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంది. ఈ చిత్రాన్ని ఉద్దేశించి తాజాగా దర్శకుడు నీరజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
జాన్వీకపూర్ ఇప్పటివరకు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. సినిమా విడుదలయ్యాక ఆమెకు ఎంతో గుర్తింపు వస్తుందన్నారు. సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడిందని చెప్పారు. ‘‘జాన్వీకపూర్ ఇప్పటివరకూ
ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమె నటనను ఉద్దేశించి చాలామంది ట్రోల్స్ చేశారు. కానీ, ఈ సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు ఆమెను ఎంతగానో ప్రశంసిస్తారు. ఆమెలోని నిజమైన నటిని గుర్తిస్తారు. ఆమె
సామర్థ్యాన్ని తెలుసుకుంటారు’’ అని నీరజ్ తెలిపారు. ‘‘ఈ సినిమా కోసం జాన్వీకపూర్‌ను ఎంచుకోవాలని ముందునుంచే అనుకున్నాను. ఆమెకు కథ చెప్పగానే ఎంతో నచ్చేసింది. మా టీమ్‌లో భాగమయ్యేందుకు
అంగీకరించింది. అయితే, ఇదొక సీరియస్ స్టోరీ. సామాజిక-రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ కథపై మరింత పట్టు రావడం కోసం అంబేడ్కర్ రచించిన ‘ది యానిహిలేషన్ ఆఫ్ కాస్ట్’ పుస్తకాన్ని ఆమెకు అందించాను.
కథను పూర్తిగా అర్థం చేసుకున్న ఆమె పాత్రలో ఒదిగిపోయింది’’ అని ఆయన వెల్లడించారు. ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న చిత్ర నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) జాన్వీకపూర్ కెరీర్ గురించి మాట్లాడారు.
ఆమె ఎదుగుదల చూస్తుంటే తనకు ఒక థెరపీలా ఉందని వెల్లడించారు. * నుదుటిన ‘సిందూరం’తో.. కేన్స్‌లో ఐశ్వర్య పవర్‌ఫుల్ లుక్ జాన్వీకపూర్, ఇషాన్ కలిసి నటించిన రెండో చిత్రమిది. వీరిద్దరి కాంబోలో
వచ్చిన తొలి చిత్రం ‘ధడక్’. ‘హోమ్‌బౌండ్’ విషయానికి వస్తే.. సామాజిక - రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా సిద్ధమైంది. ఓ మారుమూల గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులు.. సమాజంలో గౌరవ మర్యాదలను పొందడం కోసం
పోలీసు ఉద్యోగాన్ని సాధించాలనుకుంటారు. ఈక్రమంలోనే వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. సమస్యల వల్ల వారి మధ్య అనుబంధం దెబ్బతింటుంది. చివరకు వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగారా? లేదా? అనేది
ఈ సినిమా కథ. ఈ చిత్రాన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా.. 9 నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ దక్కించుకుంది.