Eleven movie review: రివ్యూ: క్రైమ్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ‘లెవెన్’ మెప్పించిందా

Eleven movie review: రివ్యూ: క్రైమ్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ‘లెవెన్’ మెప్పించిందా

Play all audios:

Loading...

న‌టీన‌టులు: న‌వీన్‌చంద్ర‌, రియా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, ఆడుకాలం నరేన్, రవి వర్మ, కిరీటి త‌దిత‌రులు సంగీతం: డి.ఇమ్మాన్‌, ఛాయాగ్ర‌హ‌ణం: కార్తీక్ అశోక‌న్‌, కూర్పు: శ్రీకాంత్.ఎన్‌.బి,


నిర్మాణం: అజ్మల్ ఖాన్, రేయా హరి, ద‌ర్శ‌క‌త్వ‌ం: లోకేశ్ అజిల్స్‌. సంస్థ‌: ఎ.ఆర్‌.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, విడుద‌ల‌: 16 మే 2025  క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌ల‌కి కేరాఫ్‌గా మారారు న‌వీన్‌చంద్ర. ఇటు


సినిమాల్లోనూ... అటు ఓటీటీ వేదిక‌ల్లోనూ ఈమ‌ధ్య ఆయ‌న ఈత‌ర‌హా క‌థ‌ల్లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా (Naveen Chandra) తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన చిత్రమే... లెవెన్‌


(Eleven Movie). త‌మిళ ద‌ర్శ‌కుడు లోకేశ్ అజిల్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌రి ఈ సినిమాతో న‌వీన్‌చంద్ర థ్రిల్‌ని పంచాడా? సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం. క‌థేంటంటే?: (Eleven


Movie Story) విశాఖ‌లో అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వ‌ర్తిస్తుంటాడు అరవింద్ (న‌వీన్‌చంద్ర‌). స్మార్ట్ పోలీస్ అధికారిగా పేరు. ఒకసారి న‌గరంలో వ‌రుస హ‌త్య‌లు క‌ల‌క‌లం


సృష్టిస్తాయి. ఆ కేసుల్ని ప‌రిశోధిస్తున్న పోలీస్ అధికారి రంజిత్ (శ‌శాంక్‌) రోడ్డు ప్ర‌మాదానికి గుర‌వుతాడు. దాంతో ఆ బాధ్య‌త అర‌వింద్ తీసుకుంటాడు. అయినా స‌రే, హ‌త్య‌ల ప‌రంప‌ర ఆగ‌దు. హంత‌కుడు


ఎవ‌ర‌న్న‌దే కాదు, హ‌త్య‌కి గురైనవాళ్ల ఆన‌వాళ్లు కూడా దొర‌క‌క‌పోవ‌డం ఈ కేసుల ప్ర‌త్యేక‌త‌. సవాల్‌గా మారిన ఈ కేసు ప‌రిశోధ‌న‌లో చివ‌రికి ఓ చిన్న ఆధారం దొరుకుతుంది. దాన్ని ప‌ట్టుకొని లాగితే


హ‌త్య‌కి గుర‌వుతున్న‌వాళ్లు ఎవరో బ‌య‌ట‌ప‌డుతుంది (Eleven Movie Review). కానీ, ఈ హ‌త్యలు చేస్తున్న‌ది ఎవ‌రనేది మాత్రం మ‌ళ్లీ  ప్ర‌శ్న‌గానే మిగిలిపోతుంది. వీట‌న్నిటివెన‌క మాస్టర్ మైండ్ ఉన్న ఓ


సైకో ఉన్నాడ‌నే అంచ‌నాకి వ‌స్తారు పోలీస్ అధికారులు. మ‌రి అర‌వింద్ ఆ సైకోని ప‌ట్టుకున్నాడా లేదా? అతను ఈ దారుణాలు చేయ‌డం వెన‌క కార‌ణాలేమిటి? త‌దిత‌ర విషయాల్ని తెర‌పై చూడాల్సిందే. ఎలా ఉందంటే:


హ‌త్య‌ల వెన‌క ఎవ‌రున్నార‌నే ఉత్కంఠని ఒక‌వైపు రేకెత్తిస్తూ... మ‌రోవైపు అనూహ్య‌మైన మ‌లుపులతో సాగే ఈ సినిమాకి ఓ మంచి క్రైమ్ థ్రిల్ల‌ర్‌కి ఉండాల్సిన ల‌క్ష‌ణాల‌న్నీ ఉన్నాయి. హృద‌యాల్ని హ‌త్తుకునే


ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా ఓ మోస్త‌రు ప్ర‌భావం చూపిస్తుంది. కాక‌పోతే సన్నివేశాల్లోనే గాఢ‌త కొర‌వ‌డింది. ఒట్టి మలుపులే కాదు, ఆ క‌థా ప్ర‌పంచాన్ని కూడా నేర వాతావ‌ర‌ణానికి త‌గ్గ‌ట్టుగా


ఆవిష్క‌రించిన‌ప్పుడే ప్రేక్ష‌కుడు అందులో మ‌రింత‌గా లీన‌మ‌వుతాడు. ఈ సినిమాలో ఆ ప్ర‌య‌త్నం స‌రిగ్గా జ‌రగ‌లేదు. చాలా స‌న్నివేశాలు సినిమాటిక్ మ‌లుపుల‌తో సాగుతున్నట్టుగా అనిపిస్తాయి త‌ప్ప, ఓ


సీరియ‌స్ ఇన్వెస్టిగేష‌న్ డ్రామా తెర‌పై నడుస్తోంద‌నే భావ‌న క‌ల‌గ‌దు. మ‌ధ్య‌లో ప్రేమ పేరుతో హీరోయిన్ వెంట‌ప‌డే స‌న్నివేశాలు ఈ సినిమాకి మ‌రింత ఇబ్బందిగా మారాయి. వ‌రుస‌గా ఒకే ర‌క‌మైన హ‌త్య‌లు,


వాటి వెన‌క ఓ మాస్ట‌ర్ మైండ్ ఉండ‌టం, అత‌నెవ‌రో క‌నుక్కునేందుకు పోలీస్ ఇన్వెస్టిగేష‌న్ మొద‌లుపెట్ట‌డం... ఈ నేప‌థ్యం చాలా సినిమాల్లో చూసిందే. దాంతో ఆరంభ స‌న్నివేశాలు మామూలుగానే అనిపిస్తాయి. ఈ


కేసు బాధ్య‌త‌ల్ని అర‌వింద్ చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి సినిమా ఆసక్తిక‌రంగా మారుతుంది. హ‌త్యలు చేస్తున్న‌ది ఎవ‌ర‌న్న‌దే కాదు,  హత్యకి గుర‌వుతున్న‌ది ఎవ‌ర‌న్న‌దో కూడా క‌నిపెట్టాల్సి రావ‌డం ఇందులో


కీల‌కం. విరామానికి ముందు, ఆ త‌ర్వాత వ‌చ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాని ప్ర‌త్యేకంగా మార్చేస్తాయి. విరామానికి ముందు స‌న్నివేశాలు థ్రిల్‌ని పంచ‌గా, ఆ త‌ర్వాత వ‌చ్చే ఎపిసోడ్ మ‌న‌సుల్ని


హ‌త్తుకునేలా ఉంటుంది. క‌వ‌ల‌ల నేప‌థ్యం, ఆ స‌న్నివేశాల రూప‌క‌ల్ప‌న కోసం చిత్ర‌బృందం తీసుకున్న శ్ర‌ద్ధ ఆక‌ట్టుకుంటుంది. ఆ ఎపిసోడ్ త‌ర్వాత క‌థ‌లో చోటుచేసుకునే అనూహ్య‌మైన మలుపులు సినిమా ముగింపు


వ‌ర‌కూ కొన‌సాగుతుంటాయి. భావోద్వేగాల్ని మేళవించి చేసిన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్‌లో కొత్తకోణం ఉంది. కొన్ని స‌న్నివేశాల‌పై ఇంకా బాగా దృష్టిపెట్టి ఉంటే, ఈ సినిమా మ‌రో స్థాయిలో ఉండేది.   ఎవ‌రెలా


చేశారంటే?: నవీన్ చంద్ర త‌న‌కు అల‌వాటైన పోలీస్ ఆఫీసర్ పాత్ర‌తో మ‌రోసారి ప్ర‌భావం చూపించాడు. ప‌తాక స‌న్నివేశాల్లో ఆయ‌న న‌ట‌న మ‌రింత‌గా మెప్పిస్తుంది. హీరోయిన్‌గా నిర్మాత రియా హ‌రి


క‌నిపిస్తారు. ప్రేమ కోణంలోనే కాకుండా, క‌థ‌తోనూ ముడిప‌డిన ఆ పాత్ర కోసం కాస్త పేరున్న  హీరోయిన్‌ని తీసుకుని ఉంటే ఈ సినిమా ఇంకా బాగుండేది. పోలీస్ అధికారులుగా శ‌శాంక్‌, దిలీప‌న్‌, ఆడుకాలం నరేన్


మెప్పిస్తారు. ఒకప్పటి హీరోయిన్ అభిరామి క‌థ‌లో ప్రాధాన్య‌మున్న పాత్ర‌ని పోషించి మెప్పించారు. ర‌వివర్మ, కిరీటి చిన్న పాత్ర‌ల్లో క‌నిపించారు. ఎడిటింగ్ మిన‌హా ఇత‌ర సాంకేతిక విభాగాల‌న్నీ మంచి


ప‌నితీరునే క‌న‌బ‌రిచాయి. ద‌ర్శ‌కుడు లోకేశ్ అజిల్స్ స్క్రీన్‌ప్లే బాగుంది. పాత క‌థ‌నే, కొత్తగా చెప్పేందుకు ఆయ‌న చేసిన  ప్ర‌య‌త్నం మెప్పిస్తుంది. నిర్మాణం బాగుంది. ద్విభాషా చిత్రం అంటూ వ‌చ్చే


 చాలా సినిమాలు...  ఒకే భాష‌లోనే చిత్రీక‌ర‌ణ చేసి వ‌దిలారన్న‌ట్టుగా న‌టీన‌టుల లిప్ సింక్‌ని బ‌ట్టి అర్థం అవుతూ ఉంటుంది. కానీ ఈ సినిమా నిజ‌మైన ద్విభాషా చిత్రం అనిపిస్తుంది. + బ‌లాలు +


మ‌లుపులున్న కథ  + ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ + నవీన్ చంద్ర పాత్ర, నటన  - బ‌ల‌హీన‌త‌లు - ప్ర‌థ‌మార్ధంలో కొన్ని స‌న్నివేశాలు - కొర‌వ‌డిన గాఢ‌త‌ చివ‌రిగా:  లెవెన్‌... మ‌లుపులు మెప్పిస్తాయి (Eleven


Movie Review)  గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.