Play all audios:
ఇంటర్నెట్‌డెస్క్: కృష్ణ జింకలను వేటాడిన కేసులో మరోసారి బాలీవుడ్ తారలు చిక్కుల్లో పడ్డారు. బాలీవుడ్ నటీనటులు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), టబు (Tabu), నీలం, సోనాలీ బింద్రేలను
నిర్దోషులుగా తేల్చుతూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా సవాలు చేసింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. ఈ అభ్యర్థనను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం.. ఇదే
వ్యవహారంలో పెండింగ్‌లో ఉన్న మిగతా పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను జులై 28వ తేదీకి వాయిదా వేసింది. * రాజమౌళి కాదు.. ఆమిర్ టీమ్ సంప్రదించింది..
బయోపిక్‌పై స్పష్టత 1998 అక్టోబర్ 1న ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రం షూటింగ్ సమయంలో జోధ్‌పుర్ పరిసర ప్రాంతాల్లో బాలీవుడ్ తారలు కొందరు కృష్ణజింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే
దీనిపై కేసు (Blackbuck Poaching Case) నమోదైంది. అనంతరం విచారణ జరిపిన ట్రయల్ కోర్టు 2018 ఏప్రిల్ 5న నటుడు సల్మాన్ ఖాన్‌ను (Salman Khan) దోషిగా తేలుస్తూ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అదే
సమయంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న సైఫ్ అలీఖాన్, టబు, సోనాలి బింద్రే, దుష్యంత్ సింగ్‌లను తగిన ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా విడుదల చేసింది. వీరిని నిర్దోషులుగా విడుదల చేయడంపై రాష్ట్ర
ప్రభుత్వం తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ శిక్షకు సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.